Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపికా పదుకొనే ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ 5 కోట్ల మంది తెలుసా?

Webdunia
బుధవారం, 8 జులై 2020 (21:52 IST)
సినిమాల పరంగా సెలెబ్రిటీల రేటింగ్ ప్రస్తుతం కనుమరుగైపోయింది. ప్రస్తుతం కొత్త ట్రెండ్ వచ్చేసింది. సోషల్ మీడియా ఆధారంగా సెలెబ్రిటీల రేంజ్‌ని ప్రస్తుతం లెక్క గడుతున్నారు.

ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్ ఇలా పలు సోషల్ మీడియా అకౌంట్స్‌లో యాక్టివ్‌గా ఉంటున్న సెలబ్రిటీలు తమ పర్సనల్‌, సినిమా, ఈవెంట్స్‌, బ్రాండింగ్ ప్రమోషన్ అంశాలని షేర్ చేస్తూ ఉన్నారు.

దీంతో వారిని ఫాలో అయ్యేవారి సంఖ్య క్రమేపి పెరుగుతూ పోతుంది. ఇలా వారి ఫోలోవర్స్ ఆధారంగా సెలెబ్రిటీల రేటింగ్ లెక్కేయడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది.
 
ప్రస్తుతం అలాంటి ఫాలోవర్స్ సంఖ్యను అమాంతం పొందిన బాలీవుడ్ హీరోయిన్‌గా స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నిలిచింది. దీపిక బాలీవుడ్ అటు హాలీవుడ్ ప్రేక్షకులని కూడా తన సినిమాలతో ఎంతగానో అలరించింది.

సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్‌‌గా వుంటుందనే విషయం తెలిసిందే. తన పెళ్ళి సమయంలో ఈ అమ్మడు పెట్టిన పోస్ట్‌లకి వేల కొలది లైక్స్ వచ్చాయి. 
 
సమాజంలో జరిగే ప్రతి విషయంపై తన సోషల్ మీడియా పేజ్ ద్వారా స్పందించే దీపికాకి ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 50 మిలియన్ల (5 కోట్లు)కి చేరింది. ఇంతమంది ఫాలోవర్లను సంపాదించుకున్న మూడో భారతీయురాలిగా దీపికా నిలిచింది.

ఇంతకముందు విరాట్ కోహ్లీ, ప్రియాంక చోప్రా ఈ ఘనత సాధించారు. కాగా తనని ఫాలో అవుతున్న వారందరికి దీపికా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మైదానంలోనే మృతి చెందిన యువకుడు

మానవ్ శర్మ ఆత్మహత్య కేసు: భార్య, మామను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకంటే?

ఇద్దరి పిల్లల్ని కట్టేసి మహిళపై అత్యాచారం చేసిన డ్రైవర్, కండక్టర్, క్లీనర్

షర్మిలపై రోజా ఫైర్.. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు..

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments