Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీజ‌ను టార్గెట్ చేసిన‌ మాజీ భ‌ర్త భ‌ర‌ద్వాజ్‌..త్వరలోనే వివాహం

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. శిరీష్‌ భరద్వాజ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత కొంత కాలం పాటు వీరు సంతోషంగా కాలాన్ని గడిపారు. అయితే ఒక పాప పుట్

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2016 (15:44 IST)
చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. శిరీష్‌ భరద్వాజ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత కొంత కాలం పాటు వీరు సంతోషంగా కాలాన్ని గడిపారు. అయితే ఒక పాప పుట్టిన తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఆ విభేదాలు తారా స్థాయికి చేరుకుని విడాకుల వరకు దారితీసిన విషయం తెల్సిందే. 
 
విడాకులు తీసుకుని కొన్ని సంవత్సరాలు గడిచిన నేపథ్యంలో శ్రీజ యూఎస్ఏలో బిజినెస్‌మేన్‌గా సెటిలైన ఎన్నారై కళ్యాణ్‌ని పెళ్లి చేసుకుంది. అయితే శ్రీ‌జ పెళ్లి విష‌యం తెలిసిన వెంట‌నే మాజీ భ‌ర్త భ‌ర‌ద్వాజ్ కూడా పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాడ‌ట‌. త‌న రెండో పెళ్లి శ్రీ‌జ‌కు దిమ్మ‌తిరిగే రీతిలో జ‌ర‌గాల‌ని ఓ పెద్ద బిజినెస్‌మ్యాన్ కుమార్తెను పెళ్లాడాల‌ని నిర్ణ‌యించుకున్నాడ‌ట‌. 
 
అయితే శ్రీజ కంటే ముందుగానే జ‌ర‌గాల్సిన ఈ పెళ్లి కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆల‌స్య‌మైంది. రాజ‌కీయాల్లో చిరుకు పోటీగా బిజేపీలో చేరి అంచెలంచెలుగా ఎదుగుతున్న భ‌ర‌ద్వాజ్ ప్ర‌స్తుతం చిరు కుమార్తె శ్రీ‌జ‌కు పెద్ద షాక్ ఇవ్వ‌డానికి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నాడ‌ట‌. భ‌ర‌ద్వాజ్ స‌న్నిహితుల నుంచి అందుతున్న స‌మాచారం ప్ర‌కారం... ఓ బ‌డా పారిశ్రామిక వేత్త కుమార్తెను పెళ్లాడ‌నున్నాడ‌ట‌. త్వరలోనే పెద్దల సమక్షంలో ఈ పెళ్లి జరగనుందని సన్నిహితులు అంటున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments