Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇది నిజమా?.. కలయా?.. జూ.ఎన్టీఆర్‌తో శ్రీదేవి... బాబీ దర్శకత్వంలో...

ఎన్టీఆర్ - బాబీ - కళ్యాణ్‌రామ్ కలయికలో తెరకెక్కనున్న చిత్రంలో 'అతిలోక సుందరి' శ్రీదేవి ఓ కీలకపాత్రలో నటిస్తారనే వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి 'ఇంగ్లీష్ వింగ్లీష్' చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభ

Webdunia
మంగళవారం, 3 జనవరి 2017 (06:07 IST)
ఎన్టీఆర్ - బాబీ - కళ్యాణ్‌రామ్ కలయికలో తెరకెక్కనున్న చిత్రంలో 'అతిలోక సుందరి' శ్రీదేవి ఓ కీలకపాత్రలో నటిస్తారనే వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి 'ఇంగ్లీష్ వింగ్లీష్' చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీదేవి కొన్నేళ్ల విరామం అనంతరం దక్షిణాదిలో తమిళ చిత్రం "పులి"తో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇపుడు ఎన్టీఆర్‌తో జతకట్టనున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వార్త నిజమైతే తెలుగు వెండితెరపై శ్రీదేవి రెండో ఇన్నింగ్స్ మూవీ ఇదే అవుతుంది. 
 
నిజానికి గతంలో దర్శకధీరుడు రాజమౌళి 'బాహుబలి' సినిమా కోసం ప్రాధేయపడినా శ్రీదేవి అంగీకరించని విషయం తెల్సిందే. కానీ ఇప్పుడు ఈ చిత్రంలో క్యారెక్టర్ నచ్చిందంటూ నటించేందుకు సై అన్నారట. అయితే అధికారికంగా ఈ విషయాన్ని ప్రొడక్షన్ హౌస్ ప్రకటించాల్సి ఉందింకా. 
 
కాగా, ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయనున్నారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై హీరో కల్యాణ్‌రామ్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయని చిత్ర వర్గాల సమాచారం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

JanaSena: వైఎస్ఆర్సీపీకి తీవ్ర ఎదురుదెబ్బ- జేఎస్పీలో ఒంగోలు, తిరుపతి నేతలు

పాత ప్రియుడైన భర్త పాతబడిపోయాడా? కొత్త ప్రియుడు స్వర్గం చూపించాడా? కాజీపేట క్రైం స్టోరీ

శివరాత్రితో మహా కుంభమేళా ముగింపు.. స్మార్ట్‌ఫోన్‌ను మూడుసార్లు గంగానదిలో ముంచింది...

బూతులకు వైసిపి పర్యాయపదం, తట్టుకున్న సీఎం చంద్రబాబుకి హ్యాట్సాఫ్: డిప్యూటీ సీఎం పవన్

Purandeswari: జగన్ మోహన్ రెడ్డి ప్రజా సమస్యలపై మాట్లాడి ఉండాలి.. పురంధేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

మధుమేహాన్ని నిర్వహించుకుంటూ మీ గుండెను కాపాడుకోవడానికి 5 ముఖ్య సూచనలు

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

తర్వాతి కథనం
Show comments