Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలీల స్థానంలో రష్మిక... అంతా భీష్మ మాయ..

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2023 (13:12 IST)
టాలీవుడ్ యువ నటి శ్రీలీల ఎన్నో సినిమా అవకాశాలను కొల్లగొడుతోంది. వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె చేతిలో ఇప్పటికే ఎనిమిదికి పైగా సినిమాలు ఉన్నాయి. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మిక మందన్న కొత్త సినిమా కోసం కొన్ని సన్నివేశాలను చిత్రీకరించిన సంగతి తెలిసిందే. 
 
అయితే ఇప్పుడు సినిమా టీమ్ నుండి రష్మిక మందన్న నిష్క్రమించడంతో ఆ సీన్లన్నీ వృధా అయ్యాయి. శ్రీలీలతో ఆ సన్నివేశాలను మళ్లీ రీషూట్ చేయాల్సి వచ్చింది. మరోవైపు రష్మిక మందన్న చాలా సినిమాల్లో బిజీగా ఉంది. సౌత్ ఇండియాలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ ఆమెకు విపరీతమైన డిమాండ్ ఉంది. 
 
నితిన్ సినిమా నుంచి రష్మిక మందన్న తప్పుకున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. చివరకు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. రష్మిక మందన్నకు బదులుగా శ్రీలీల హీరోయిన్‌గా ఎంపికైంది.
 
నితిన్, వెంకీ కుడుముల, రష్మిక మందన్న గతంలో కలిసి పనిచేసిన భీష్మ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. సినిమా హిట్ అయింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో కొత్త సినిమా రాబోతోందని చెప్పడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు.
 
రష్మిక మందన్న ప్రస్తుతం పుష్ప 2లో కథానాయికగా కనిపించనుంది. త్వరలో ఆమె రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ చిత్రం యానిమల్ ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటుంది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ సీనియర్ నేత జీవన్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం పిలుపు!!

సున్నపురాయి గనుల వేలం.. కాస్త టైమివ్వండి.. రేవంత్ విజ్ఞప్తి

తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన తమిళనాడు ఎంపీ

అత్యవసరం ఉంటే తప్పా... ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. పౌరులకు భారత్ హెచ్చరిక!

లోక్‌సభ స్పీకరుగా ఓం బిర్లా ఎన్నిక.. ప్రొటెం స్పీకర్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments