Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనమ్ కపూర్‌కి ఏమయినా పిచ్చా? ప్రభాస్‌తో వద్దంటోందేమిటి?

సోనమ్ కపూర్. ఈమె పేరు చెప్పగానే బాలీవుడు కుర్రకారు చొంగ కార్చుకుంటారనే అభిప్రాయాలున్నాయి. పైగా మాజీ ప్రపంచ సుందరి, పెళ్లయినా గ్లామర్ అందాలతో బాలీవుడ్ ఇండస్ట్రీ లుక్‌ను తిప్పుకునే ఐశ్వర్యా రాయ్‌ను ఆంటీ

Webdunia
సోమవారం, 3 జులై 2017 (16:46 IST)
సోనమ్ కపూర్. ఈమె పేరు చెప్పగానే బాలీవుడు కుర్రకారు చొంగ కార్చుకుంటారనే అభిప్రాయాలున్నాయి. పైగా మాజీ ప్రపంచ సుందరి, పెళ్లయినా గ్లామర్ అందాలతో బాలీవుడ్ ఇండస్ట్రీ లుక్‌ను తిప్పుకునే ఐశ్వర్యా రాయ్‌ను ఆంటీ అంటూ పొగరుగా సమాధానం చెప్పేస్తుంది. అంతేనా... బాహుబలి చిత్రంలో తమన్నా నటించిన అవంతిక పాత్ర ఇస్తామంటే... అబ్బే నాకేం వద్దులే అనేసిందట. ఇవన్నీ సోనమ్ కపూర్ గురించి వచ్చిన వార్తలు. 
 
ఇక తాజా ముచ్చట ఏంటయా అంటే... బాహుబలి ప్రభాస్ తన తదుపరి చిత్రం సాహోలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ కోసం వేట జరుగుతోంది. ఇందులో భాగంగా ప్రభాస్ సరసన నటించమని సోనమ్ కపూర్‌ను సంప్రదించారట దర్శకనిర్మాతలు. హీరోగా ప్రభాస్ నటిస్తున్నాడని కూడా చెప్పారట. ఐతే సోనమ్ మాత్రం... కూల్‌గా... సర్లే ముందు కథ చెప్పండి అని అడిగిందట. కథ విన్న తర్వాత అక్కడి నుంచి లేచెళ్లిపోయిందట. 
 
ఆ తర్వాత ఆమె నుంచి సమాధానం రాలేదట. దీనితో దర్శకనిర్మాతలు మరో హీరోయిన్ కోసం వెతికే పనిలోపడ్డారట. వాళ్లలా వెతుకుతుంటే... అదేంటి కథ నాకు చెప్పి మరో హీరోయిన్ కోసం ఎందుకు వెతుకుతున్నారు అంటూ తిక్కగా మాట్లాడుతోందట. సర్లే అని మళ్లీ ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తోందట. ఎంతకీ రెస్పాండ్ అవడం లేదట. దీన్నిబట్టి ఇక ఆమె ప్రభాస్ సరసన సాహోలో నటించే అవకాశం లేదంటున్నారు. ఇది తెలిసిన కొందరు బాలీవుడ్ జనం... సోనమ్ కపూర్ కేమైనా పిచ్చా అంటూ సెటైర్లు వేస్తున్నారట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

వివాహేతర సంబంధం: పెళ్లయ్యాక మరొక వ్యక్తితో ఇష్టపూర్వక శృంగారం తప్పు కాదు కానీ...

కేరళ తిరూర్.. ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు.. టూవీలర్‌పై జర్నీ చేసిన వారికి?

కస్టోడియల్ టార్చర్ చేసినవారంతా జైలుకు వెళ్లడం ఖాయం : ఆర్ఆర్ఆర్

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు స్థల పరిశీలన : మంత్రి టీజీ భరత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments