Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియల్‌ లైఫ్‌లోనూ ర్యాగింగ్‌ తప్పలేదట : సోనాక్షి సిన్హా

బాలీవుడ్‌ బొద్దు గుమ్మ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ''అకీరా''. 2011లో తమిళంలో వచ్చిన మౌనగురు చిత్రానికి రీమేక్‌గా అకీరా చిత్రం తెరకెక్కుతోంది.

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2016 (17:37 IST)
బాలీవుడ్‌ బొద్దు గుమ్మ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ''అకీరా''. 2011లో తమిళంలో వచ్చిన మౌనగురు చిత్రానికి రీమేక్‌గా అకీరా చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో సోనాక్షితో పాటు శతృఘ్న సిన్హా, కొంకణా సెన్ శర్మ, ఊర్మిళా మహంతా, అమిత్ సాద్, అనురాగ్ కశ్యప్, మిథున్ చక్రవర్తి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకోసం సోనాక్షీ ఎంత కష్తపడిందో చూస్తే ఆశ్చర్య పోతారు.. యాక్షన్ హీరోల స్థాయిలో ఫైట్లు చేసిన సోనాక్షీ డూప్ కూడా అవసరం లేనంతగా స్టంట్స్ చేయటంలో శిక్షణ తీసుకుంది.
 
 ఏ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సోనాక్షి యాక్షన్‌ రోల్‌లో నటిస్తోంది. ఈ సినిమాలో తన పాత్ర కోసం చాలా కష్టపడింది సోనాక్షి. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా మార్షల్‌ ఆర్ట్స్‌లో ట్రైనింగ్‌ తీసుకుంది. సినిమాలో తనను ర్యాగింగ్‌ చేసే తోటి విద్యార్థులను, తన వెంట పడే ఆకతాయిలను చితక్కొడుతూ ఉంటుంది. అకీరా చిత్రం ఎక్కువగా ర్యాగింగ్‌ నేపథ్యంలోనే సాగుతుంటుంది. అయితే సోనాక్షికి రీల్‌ లైఫ్‌లోనే కాకుండా రియల్‌ లైఫ్‌లోనూ ర్యాగింగ్‌ తప్పలేదట. గొప్ప నటుడు, రాజకీయవేత్త అయిన శతృఘ్న సిన్హా కూతురు అయివుండి కూడా ర్యాగింగ్‌ కష్టాలు పడ్డానంటోంది.
 
ఈ విషయాన్ని సోనాక్షి స్వయంగా వెల్లడించింది...''నేను శ్రీమతి నతీబాయి దామోదర్‌ థాకర్సే ఉమెన్స్‌ యూనివర్శిటీలో చదువుకున్నాను. అక్కడ అంతా అమ్మాయిలే ఉన్నా వాళ్లతో ఫ్రెండ్‌షిప్‌ చేయడం కష్టమే. అయితే నన్ను ర్యాగ్‌ చేసినవారు, నేను ర్యాగింగ్‌ చేసినవారంతా నాకు ఇప్పటికీ స్నేహితులే. ర్యాగింగ్‌ అనేది సింపుల్‌ ఎంజాయ్‌మెంట్‌లా ఉండాలి కానీ విద్యార్థి జీవితంలో అవరోధాలు సృష్టించే విధంగా ఉండకూడదు''అని సోనాక్షి తన మనసులోని మాటను బయటపెట్టింది. సెప్టెంబర్‌ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments