Webdunia - Bharat's app for daily news and videos

Install App

''అమేజింగ్ భార్యలు.. అదిరిపోయారు'' అంటూ కామెంట్ చేసిన మెగా కోడలు

దక్షిణాది సినీ ప్రముఖులు ఒకే వేదికపై కలవడం కన్నుల పండుగగానే వుంటుంది. పలు సినిమా ఫంక్షన్లు, ఇతరత్రా కార్యక్రమాలు జరిగినా, సినీ ప్రముఖులు ఒకే వేదికపై కన్పించడం అరుదుగానే జరుగుతుంటుంది. అలాంటి అరుదైన ఘట

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2016 (16:55 IST)
దక్షిణాది సినీ ప్రముఖులు ఒకే వేదికపై కలవడం కన్నుల పండుగగానే వుంటుంది. పలు సినిమా ఫంక్షన్లు, ఇతరత్రా కార్యక్రమాలు జరిగినా, సినీ ప్రముఖులు ఒకే వేదికపై కన్పించడం అరుదుగానే జరుగుతుంటుంది. అలాంటి అరుదైన ఘటన ఇటీవల చోటుచేసుకుంది. మెగాస్టార్‌ చిరంజీవి 61వ జన్మదిన వేడుక హైదరాబాద్‌లోని పార్కు హయాత్ హోటల్‌లో జరిగిన విషయం తెలిసిందే. ఈ పార్టీకి మహేశ్‌బాబు సతీమణి నమ్రత శిరోద్కర్, రామ్‌చరణ్‌ భార్య ఉపాసన, అల్లు అర్జున్‌ భార్య స్నేహారెడ్డి వచ్చారు.
 
 అంతేకాదు ఈ ముగ్గురు కలిసి ఫొటోకు ఫోజిచ్చారు. ఉపాసన, స్నేహ రెడ్డి.. వీళ్లు ఎప్పుడూ కలసి ఫోటోలు దిగుతూనే ఉంటారు. కాని వీరితో మాజీ హీరోయిన్ నమ్రతా శిరోద్కర్ కలసి దిగడం నిజంగా అద్భుతమేనని సినీ వర్గాలు అంటున్నాయి.  వీరు ముగ్గురు ఒకరి చేతులను మరొకరు పట్టుకుని మేమంతా ఒకటే అని చెప్తూ ఫోటో దిగారు. ఈ అరుదైన ఫోటోని ఉపాసన సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసి..''అమేజింగ్ భార్యలు.. అదిరిపోయారు'' అంటూ కామెంట్ చేసింది. అంతేకాదండోయ్.. ''వెయిటింగ్ ఫర్ శ్రీయ భూపాల'' అని కూడా చెప్పింది. ఇంతకీ ఆ శ్రీయ ఎవరో తెలుసా... అక్కినేని అఖిల్ ప్రేమంచిన అమ్మాయే. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోను మీరు తిలకించండి.
 

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments