ప్రభాస్ మూవీ కోసం సింగీతం, అసలు సీక్రెట్ ఇదే

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (14:10 IST)
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా చేస్తున్నారు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రాన్ని యు.వి. క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్, మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో సినిమా చేయనున్నారు. ఇది పాన్ ఇండియా మూవీ కాదు పాన్ వరల్డ్ మూవీ అనగానే అసలు కథ ఏంటి.? ప్రభాస్‌ని నాగ్ అశ్విన్ ఎలా చూపించబోతున్నారు అని అటు అభిమానుల్లోను ఇటు ఇండస్ట్రీలోను ఆసక్తి ఏర్పడింది.
 
అయితే.. కథ గురించి ఎలాంటి వార్త బయటకు రాలేదు. ఇప్పుడు సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావును ఈ సినిమా కోసం తీసుకున్నారు. ఆయన గైడెన్స్‌లో నాగ్ అశ్విన్‌లో ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. అయితే.. ఈ మూవీ స్టోరీ గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. ఇది టైమ్ మిషన్ కాన్సెప్ట్‌తో రూపొందే సినిమా అట.
 
సింగీతం శ్రీనివాసరావు టైమ్ మిషన్ కాన్సెప్ట్ తోనే ఆదిత్య 369 సినిమాని తీసిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్‌గా ఆదిత్య 999 తీయాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు కానీ.. ఇంకా సెట్ కాలేదు.
 
ఇదిలా ఉంటే... టైమ్ మిషన్ కాన్సెప్ట్‌తో సినిమా తీసిన అనుభవం ఉండటం వలన ఈ మూవీకి ఆయన ఎక్స్‌పీరియన్స్ ఎంతగానో ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతోనే సింగీతం శ్రీనివాసరావును ఈ సినిమా కోసం తీసుకున్నారని తెలిసింది. ఇది ప్రభాస్ మూవీ కోసం సింగీతంను తీసుకోవడం వెనకున్న సీక్రెట్..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Google‌కి బాబు ఇచ్చిన ప్రోత్సహకాలు చూసి గుడ్లు తేలేస్తున్న కర్నాటక ఐటి మినిస్టర్ (Video)

మంత్రి నారాయణగారు నన్నేమన్నారో చూపించండి: వర్మ సూటి ప్రశ్న (video)

కొండా సురేఖ ఇంట్లో అర్థరాత్రి హైడ్రామా.. మా అమ్మ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకునేది? (video)

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్‌ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments