Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబరు 22 నటుడిగా ప్రాణం పోసుకున్న రోజు : చిరంజీవి

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (13:48 IST)
మెగాస్టార్ చిరంజీవి వెండితెర బాస్. ఈయన జీవితంలో రెండు తేదీలను ఎప్పటికీ మరిచిపోలేరు. ఒకటి చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22వ తేదీ. రెండోది నటుడిగా తన తొలి చిత్రం విడుదలైన సెప్టెంబరు 22వ తేదీ. కొణిదెల శివశంకర వరప్రసాద్ అనే కుర్రోడు 1955 ఆగ‌స్టు 22వ తేదీన జన్మించాడు. అయితే, 1978 సెప్టెంబ‌ర్ 22న సిల్వ‌ర్ స్క్రీన్‌కు న‌టుడిగా చిరంజీవిగా ప‌రిచ‌య‌మైన రోజు. 
 
ఇపుడు మెగాస్టార్‌గా అభిమానుల నీరాజ‌నాలు అందుకుంటున్న చిరంజీవి తొలి చిత్రం "ప్రాణం ఖ‌రీదు". ఈ చిత్రం విడుద‌లై నేటితో 42 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మ‌ధుర‌మైన క్ష‌ణాల‌ను మెగాస్టార్ గుర్తుచేసుకున్నారు. 
 
''నా జీవితంలో ఆగ‌స్టు 22కు ఎంత ప్రాముఖ్య‌త ఉందో.. సెప్టెంబ‌ర్ 22కు కూడా అంతే ప్రాముఖ్యం ఉంది. ఆగ‌స్టు 22 నేను మ‌నిషిగా ప్రాణం పోసుకున్న రోజైతే.. సెప్టెంబ‌ర్ 22 న‌టుడిగా 'ప్రాణం(ఖరీదు)' పోసుకున్న రోజు. నా మొద‌టి సినిమా విడుద‌లైన రోజు. నన్ను ఇంత‌గా ఆద‌రించి నన్ను ఈ స్థాయికి చేర్చిన సినీ ప్రేక్ష‌కులంద‌రికీ, ముఖ్యంగా నా ప్రాణానికి ప్రాణ‌మైన అభిమానులంద‌రికీ మ‌న‌స్ఫూర్తిగా కృతజ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాన‌ని'' చిరంజీవి ట్వీట్ చేశారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments