Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళ హీరో శింబు ప్రేమలో పడ్డాను.. కానీ మనసులు కలిశాయనుకున్నా.. : హన్సిక

తమిళ హీరో శింబు ప్రేమలో పడిన మాట వాస్తవమేనని హీరోయిన్ హన్సిక చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తమ ఇద్దరి మనస్సులు కలిశాయని భావించాననీ, కానీ అదంతా ఒట్టి భ్రమేనని తేలిపోయిందన్నారు.

Webdunia
ఆదివారం, 26 మార్చి 2017 (14:03 IST)
తమిళ హీరో శింబు ప్రేమలో పడిన మాట వాస్తవమేనని హీరోయిన్ హన్సిక చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తమ ఇద్దరి మనస్సులు కలిశాయని భావించాననీ, కానీ అదంతా ఒట్టి భ్రమేనని తేలిపోయిందన్నారు. 
 
తాజాగా ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... హీరో శింబుతో లవ్‌లో పడిన మాట వాస్తవమేనని చెప్పింది. అయితే, ఇపుడు ఆ ప్రేమ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదని తెలిపింది. అసలు తాము గొడవ కూడా పడలేదని చెప్పింది. అతను ఒక మాట అన్నాడని... దాంతో, తన మనసు విరిగిపోయిందని చెప్పింది. ప్రతిగా తాను కూడా ఒకే ఒక మాట అనేసి, శింబు నుంచి దూరంగా జరిగిపోయానని తెలిపింది.
 
ఇకపోతే... తామిద్దరూ విడిపోయిన తర్వాత కూడా కలసి సినిమా చేశామని... వ్యక్తిగతంగా, వృత్తి పరంగా శింబుతో తనకు ఎలాంటి ఇబ్బంది  లేదని హన్సిక తెలిపింది. ఇద్దరి మనసులు కలిశాయని తాను భావించానని... అయితే, అదంతా భ్రమే అనే విషయం తేలిపోయిందని, దాంతో తాను పక్కకు జరిగిపోయానని చెప్పింది. వాస్తవానికి అది జరిగిన సమయంలో తనకు అంత మెచ్యూరిటీ కూడా లేదని హన్సిక వివరణ ఇచ్చింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆపరేషన్ సిందూర్‌పై అసత్య ప్రచారం.. ఆ రెండు దేశాలకు షాకిచ్చిన భారత్

చార్మినార్ వద్ద ప్రపంచ సుందరీమణులు, ఒక్క కుక్క కనబడితే ఒట్టు

టీలో నిద్రమాత్రలు కలిపి భార్యకు ఇచ్చి భర్త అత్యాచారం...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,030 మంది టిబి రోగులకు గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ సాయం

కల్నల్ సోఫియా ఖురేషిపై విజయ్ షా కామెంట్స్- ఫైర్ అయిన వైఎస్ షర్మిల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments