Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా శక్తిని తెలుపుతూ శృతిహాసన్ వీడియో... సోషల్ మీడియాలో వైరల్

హీరోయిన్ శృతిహాసన్ నటించిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. ఆమె నటించిన 'బి ద బిచ్' అనే వీడియో తాజాగా విడుదలైంది. మహిళలను కించపరుస్తూ మాట్లాడే ఆ పదానికి శృతిహాసన్ ఈ వీడియోలో అర్థాన్

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2016 (11:55 IST)
హీరోయిన్ శృతిహాసన్ నటించిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. ఆమె నటించిన 'బి ద బిచ్' అనే వీడియో తాజాగా విడుదలైంది. మహిళలను కించపరుస్తూ మాట్లాడే ఆ పదానికి శృతిహాసన్ ఈ వీడియోలో అర్థాన్ని తెలుపుతూ.. మహిళా శక్తిని తెలియ జెప్పింది. ఈ వీడియోను శృతిహాసన్‌నే రచించడం మరో విశేషం. 
 
"బిచ్... చాలా మంది జీనియస్ మమ్మల్ని ఇలా సంబోధిస్తారు. మీకు స్థానం లేక, ఆ పదంతో మా స్థానాన్ని నిర్ధారిస్తారు... బిచ్ అంటే మల్టీ టాస్కర్... బిచ్ ఓ ఉపాధ్యాయురాలు... వ్యవస్థకు వ్యతిరేకంగా ఉంటుంది... హార్మోన్లతో నిండిన అమ్మాయి బిచ్... ఇన్ దట్ వే 'ఎస్' ఐయామ్ ఏ బిచ్..." అంటూ ఈ వీడియో సాగుతుంది. వీడియో విడుదలైన కొన్ని గంటల్లోనే లక్షల కొద్దీ హిట్స్ వచ్చాయి. 
 
మరోవైపు, దక్షిణాది నటీనటులంతా శ్రుతి వీడియోకు ఫిదా అయిపోయారు. ఇప్పటి దాకా ఈ సిరిస్ కింద కల్కి కొచ్చిన్, నిమ్రత్ కౌర్ రాధిక ఆప్టే వంటి హీరోయిన్లు, అమితాబ్‌లాంటి సూపర్ స్టార్లు మాత్రమే గొంతు విప్పారు. కల్చర్ మిషన్స్ డిజిటల్ ఛానెల్స్ బ్లష్ దీనిని పబ్లిష్ చేసింది. స్వచ్ఛమైన ఆశయం, హార్మోన్లతో ఉన్న వ్యక్తే ఆమె అంటూ శృతిహాసన్ తన వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియోకు పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు లభించాయి. రానా దగ్గుబాటి, త్రిష, అర్జున్ రామ్ పాల్, సుషాంత్, శ్వేతా పండిత్ తదితరులు ట్విట్టర్ వేదికగా శృతిహాసన్‌ను అభినందించారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments