Webdunia - Bharat's app for daily news and videos

Install App

లండన్‌లో యంగ్ మ్యుజిషియన్‌తో డేటింగ్ చేస్తున్న శృతిహాసన్...

విశ్వనటుడు కమల్ హాసన్ నట వారసురాలిగా ఆయన ముద్దుల కూతురు శృతి హాసన్ ఎంట్రీ ఇచ్చింది. నటన, సంగీతం, డ్యాన్స్ అన్ని రంగాల్లో తనదైన శైలితో తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది.

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2016 (16:42 IST)
విశ్వనటుడు కమల్ హాసన్ నట వారసురాలిగా ఆయన ముద్దుల కూతురు శృతి హాసన్ ఎంట్రీ ఇచ్చింది. నటన, సంగీతం, డ్యాన్స్ అన్ని రంగాల్లో తనదైన శైలితో తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది. 
 
టాలీవుడ్‌లో మాత్రం పవన్ కళ్యాణ్ నటించి "గబ్బర్ సింగ్‌"తో ఈ అమ్మడు దశ తిరిగిపోయింది. ఇపుడు మరోమారు పవన్ కళ్యాణ్‌తో 'కాటమరాయుడు' చిత్రంలో జతకట్టనుంది. ఇప్పటికే పవన్‌తో 'గబ్బర్ సింగ్' చిత్రంలో నటించిన శృతి మరోసారి 'కాటమరాయుడు' చిత్రంలో కనిపించి మురిపించబోతుంది. 
 
తాజాగా ఈ అమ్మడు డేటింగ్‌లో ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఖాళీ దొరికితే లండన్‌లో శృతి వాలిపోయింది. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్‌తో చేస్తున్న 'కాటమరాయుడు' మూవీ షెడ్యూల్ పొల్లాచ్చిలో పూర్తికాగానే లండన్‌కు చేరిపోయింది. అక్కడే ఓ యంగ్ మ్యుజిషియన్‌తో శృతి డేటింగ్ చేస్తోందట. దీనిపై స్పందించిన శృతి మాత్రం అబ్బే అలాంటిది ఏమీ లేదని కొత్త మ్యూజిక్ ఆల్బం కోసమే తరచుగా లండన్ వెళ్తున్నానంటోంది. 
 
శృతిహాసన్ గాయని కూడా కాడవడంతో న్యూ మ్యూజిక్ ఆల్బం కోసం లండన్ వెళుతున్నానని చెపుతూ డేటింగ్ మ్యాటర్ కవర్ చేస్తోందంటున్నారు. మొత్తానికి ఓ వైపు సినిమాలు తీస్తూ మరోవైపు డేటింగ్ కూడా చాలా సీక్రెట్‌గా మెయింటేన్ చేస్తుందనే పుకార్లు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

విశాఖ - హైదరాబాద్ వందే భారత్ ప్రయాణికులకు శుభవార్త!!

క్రీడాకారిణిపై 62 మంది అత్యాచారం ... కోచ్‍‌ - సహ ఆటగాళ్ళు కూడా...

కార్చిచ్చులో కాలిపోయిన hollywood సెలబ్రిటీల ఆస్తులు, పదివేల ఇళ్లకు పైగా బుగ్గి (video)

Rahul Gandhi: తెలంగాణలో జనవరి 27న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పర్యటన

బోయ్‌ఫ్రెండ్ కష్టాల్లో వున్నాడని భర్త డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసింది... ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments