Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కుమార‌స్వామి త‌న‌యుడు నిఖిల్‌తో చిందేయనున్న శృతిహాస‌న్

లోకనాయకుడు కమల్ హాసన్ పెద్ద కూతురు శృతిహాసన్ ఇప్పటికే సినిమాల్లోకి వచ్చి టాప్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. దక్షిణాదిలో బిజీ హీరోయిన్ ఎవరంటే కూడా ఠక్కున గుర్తొచ్చే పేరు శృతిహాస‌న్.

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2016 (15:20 IST)
లోకనాయకుడు కమల్ హాసన్ పెద్ద కూతురు శృతిహాసన్ ఇప్పటికే సినిమాల్లోకి వచ్చి టాప్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. దక్షిణాదిలో బిజీ హీరోయిన్ ఎవరంటే కూడా ఠక్కున గుర్తొచ్చే పేరు శృతిహాస‌న్. హీరోయిన్‌గా మాత్రమే కాకుండా స్పెష‌ల్ సాంగ్స్‌లో చిందులేసి అందరిని ఆకట్టుకుంటోంది. కాగా ఈ హీరోయిన్ ఓ యువ హీరో సినిమా కోసం స్పెషల్ సాంగ్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. 
 
క‌ర్ణాట‌క మాజీ సీఎం కుమార‌స్వామి త‌న‌యుడు నిఖిల్ కుమార్ హీరోగా మ‌హ‌దేవ్ దర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'జాగ్వార్'. తెలుగు, క‌న్న‌డంలో రూ.75 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఎస్ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా చిత్రంలో ఓ స్పెష‌ల్ సాంగ్ కోసం శృతిహాస‌న్‌తో డాన్స్ చేయించాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. ఈ పాటకోసం శృతికి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ కుడా ఆఫర్ చేసినట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మ‌రి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు వేచియుండాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు : అలా వచ్చారు.. ఇలా వెళ్ళారు.. వైకాపా సభ్యుల తీరు మారదా?

Donald Trump: యూఎస్ఏఐడీ సాయాన్ని 90 రోజులు నిలిపివేస్తాం.. డొనాల్డ్ ట్రంప్

నేనుండగా ఆ మహిళతో అక్రమ సంబంధమా? ప్రశ్నించిన భార్య.. చంపేసిన భర్త!

నేటి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు.. సభకు రానున్న పులివెందుల ఎమ్మెల్యే జగన్

వ్యభిచార గృహం మంచం కింద అడ్డంగా దొరికిన వైకాపా నేత శంకర్ నాయక్!! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

తర్వాతి కథనం
Show comments