Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ సరసన శ్రద్ధా కపూర్.. ''సాహో'' తర్వాత.. త్రివిక్రమ్ సినిమాలో..

''సాహో''లో బాహుబలి స్టార్ ప్రభాస్ సరసన నటిస్తున్న శ్రద్ధా కపూర్‌.. మరో టాలీవుడ్ అగ్రహీరో నటించే అవకాశాన్ని కైవసం చేసుకుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన

Webdunia
మంగళవారం, 30 జనవరి 2018 (10:09 IST)
''సాహో''లో బాహుబలి స్టార్ ప్రభాస్ సరసన నటిస్తున్న శ్రద్ధా కపూర్‌.. మరో టాలీవుడ్ అగ్రహీరో నటించే అవకాశాన్ని కైవసం చేసుకుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన తదుపరి సినిమాను ఎన్టీఆర్‌తో మొదలుపెట్టనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రారంభోత్సవం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతుల మీదుగా జరిగింది. 
 
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో త్రివిక్రమ్ బిజీగా వున్నాడు. ఇక ఎన్టీఆర్ కొత్త లుక్‌లో కనిపించేందుకు కసరత్తు చేస్తున్నాడు. త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ఈ సినిమా కోసం హీరోయిన్‌ను వెతుకుతున్నారు.  ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే చేసే అవకాశాలు ఎక్కువగా వున్నాయనే వార్తలు వినిపించాయి. కానీ తాజాగా శ్రద్ధాకపూర్ పేరు కూడా తెరపైకి వచ్చింది.
 
 దీనిని బట్టి పూజా హెగ్డేతో పాటు శ్రద్ధాకపూర్‌ను తీసుకోనున్నారా? అనే దానిపై క్లారిటీ రావాల్సి వుంది. హారిక అండ్ హాసిని బ్యానర్ పై రూపొందే ఈ సినిమాకి, అనిరుథ్ సంగీతాన్ని అందించనున్నాడు. మార్చిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో శ్రద్ధా కపూర్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేయడం ఖాయమని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments