సల్మాన్ ఖాన్‌తో సినిమాకు ప్లాన్ చేస్తోన్న సమంత?

సెల్వి
బుధవారం, 24 జనవరి 2024 (15:16 IST)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బాలీవుడ్ చిత్రంలో కనిపించనుందని టాక్ వస్తోంది. మయోసైటిస్ కారణంగా ఏడాది పాటు సినిమాలకు దూరంగా వుంటూ విశ్రాంతి తీసుకుంటున్న సమంత.. ప్రస్తుతం బిటౌన్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది. 
 
సమంత రూత్ ప్రభు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో కలిసి రాబోయే చిత్రం కోసం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ముంబైలో ఉన్న సమంత తన బ్రాండ్ ఉనికిని పెంచుకోవడానికి సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేయడానికి రెడీ అన్నట్లు టాక్. ఇందుకోసం చిత్రనిర్మాతలు, బ్రాండ్ ఎండార్సర్‌లతో చర్చలు జరుపుతోంది. 
 
భారతీయ టీవీ సిరీస్ 'సిటాడెల్'లో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్‌తో ఇప్పటికే ఒక ప్రాజెక్ట్‌లో పనిచేసిన సమంత.. పాన్-ఇండియా ప్రేక్షకులను చేరుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగా సల్మాన్ ఖాన్‌తో రాబోయే ప్రాజెక్ట్ కోసం సమంతను ఆలోచిస్తున్నట్లు సమాచారం. గతంలో పూజా హెగ్డే వంటి దక్షిణ భారత నటీమణులతో కలిసి పనిచేసిన సల్మాన్ ఖాన్ సమంత ప్రతిభను మెచ్చుకున్నారు. 
 
హిందీ స్పై థ్రిల్లర్ 'ది ఫ్యామిలీ మ్యాన్' రెండవ సీజన్‌‌ ద్వారా బాలీవుడ్‌లో తన సత్తా ఏంటో నిరూపించింది.రాజి పాత్రకు ప్రశంసలు అందుకుంది. మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి సూపర్ స్టార్‌లతో కలిసి టాలీవుడ్‌లో నటించిన సమంత.. కోలీవుడ్‌లోనూ విజయ్, విశాల్ స్టార్‌లతో కలిసి పని చేసింది.
 
ఇంకా 'ఓ బేబీ', 'యశోద' వంటి లేడి ఓరియెంటెడ్ సినిమాలలో తన నటనా నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో తన సత్తా ఏంటో నిరూపించేందుకు పావులు కదుపుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు సమయం ఆసన్నమైంది : పవన్ కళ్యాణ్

నా ముందు ప్యాంట్ జిప్ తీస్తావా? చీపురుతో చితక్కొట్టిన పారిశుద్ధ్య కార్మికురాలు (video).. ఎక్కడ?

కొత్త ఇల్లు కట్టావ్ లక్ష ఇస్తావా లేదా? ఇవ్వనన్నందుకు యజమానిని చితక్కొట్టిన హిజ్రాలు

Low Pressure: బంగాళాఖాతంలో నవంబర్ 19 నాటికి అల్పపీడనం

నిద్రపోతున్నప్పుడు భారీ వస్తువుతో దాడి.. టైల్ కార్మికుడు హత్య.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

తర్వాతి కథనం
Show comments