Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనాథ పిల్లల కోసం గుంటూరు కారం స్పెషల్ స్క్రీనింగ్ నిర్వహించిన సితార ఘట్టమనేని

Advertiesment
Sithara Ghattamaneni with     orphans

డీవీ

, సోమవారం, 22 జనవరి 2024 (11:33 IST)
Sithara Ghattamaneni with orphans
సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని అందరి మనసులు గెలుచుకునే గొప్ప పని చేసింది. చీర్స్ ఫౌండేషన్‌లోని అనాథ పిల్లల కోసం, సంక్రాంతి కానుకగా విడుదలైన తన తండ్రి తాజా చిత్రం "గుంటూరు కారం" ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించింది. మహేష్ బాబు ఫౌండేషన్ సహకారంతో ఏఎంబీ సినిమాస్‌లో ఈ కార్యక్రమం జరిగింది.
 
చీర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని పసి హృదయాలకు సినిమాటిక్ ట్రీట్‌ను అందిస్తూ ఏఎంబీ సినిమాస్‌లో అద్భుత సాయంత్రం ఆవిష్కృతమైంది. పిల్లలతో పాటు, వారి సంరక్షకులు కూడా మహేష్ బాబు నటించిన తాజా చిత్రం "గుంటూరు కారం" యొక్క ప్రత్యేక ప్రదర్శనకు హాజరయ్యారు.
 
సితార ఘట్టమనేని, తన సహజసిద్ధమైన ఆకర్షణతో, పిల్లలందరూ ప్రత్యేకంగా భావించేలా మరియు సినిమా వేడుకలో భాగమయ్యేలా అద్భుతంగా హోస్ట్‌ చేసింది. పిల్లల ఆనందం మరియు ఉత్సాహం వేడుకకు అదనపు ఆకర్షణగా నిలిచాయి.
 
మహేష్ బాబు ఫౌండేషన్‌ సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమం వెండితెర వెలుపల ఆనందాన్ని పంచాలనే ఘట్టమనేని కుటుంబం యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఈ చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు నింపే అవకాశం రావడం పట్ల సూపర్ స్టార్ మహేష్ బాబు హర్షం వ్యక్తం చేశారు.
 
మహేష్ బాబు ఫౌండేషన్ వివిధ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటుంది. ఇప్పుడు ఈ ప్రత్యేక ప్రదర్శన సమాజంపై సానుకూల ప్రభావం చూపుతుంది. అనాథ పిల్లల సంక్షేమం కోసం అంకితభావంతో పని చేస్తున్న చీర్స్ ఫౌండేషన్, మహేష్ బాబు ఫౌండేషన్ సహకారంతో పిల్లలకు చిరస్మరణీయ అనుభవాన్ని అందించింది.
 
ప్రత్యేక స్క్రీనింగ్ ప్రారంభమయ్యాక.. నవ్వులు మరియు ఆనందోత్సాహాలు ఈ హృదయపూర్వక సినిమా వేడుక విజయాన్ని ప్రతిధ్వనించాయి. ఘట్టమనేని కుటుంబం మరియు మహేష్ బాబు ఫౌండేషన్ ఇలాంటి ఆనంద క్షణాలను మరిన్ని సృష్టించాలని మరియు సినిమా యొక్క మాయాజాలాన్ని వ్యాప్తి చేయాలని భావిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుట్టినరోజుకు ముందు రామమందిరం రావడం అదృష్టం : రామ్ చరణ్‌