Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ డైరెక్టర్‌తో ప్రేమలో వున్న సమంత? చేతులు పట్టుకుని సంథింగ్ సంథింగ్

సెల్వి
సోమవారం, 3 ఫిబ్రవరి 2025 (16:46 IST)
Samantha_Raj
టాలీవుడ్ హీరోయిన్ సమంత కొత్త వ్యక్తితో ప్రేమలో వుందా అనే అనుమానాలు వస్తున్నాయి. బాలీవుడ్ డైరెక్టర్‌తో కలిసి మీడియా కంటపడటంతో లేనిపోని రూమర్స్ వస్తున్నాయి. అక్కినేని నట వారసుడు, హీరో నాగచైతన్యతో ప్రేమ, పెళ్లి, విడాకుల తర్వాత సమంత సింగిల్‌గా తన లైఫ్‌ను కొనసాగిస్తోంది. 
 
ఓ వైపు మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్న బాలీవుడ్‌లో వరుస సినిమాలు, సిరీస్‌లలో నటిస్తూ బిజీ బిజీగా మారిపోయింది. ఇటీవల నాగ చైతన్య శోభిత దూళిపాళ్లను రెండవ వివాహం జరిగింది. అప్పటి నుంచి సమంత కూడా రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. 
 
కానీ సమంత మాత్రం తాను రెండో పెళ్లి చేసుకోనని మాత్రం ఎక్కడా కూడా చెప్పడం లేదు. గత కొంతకాలంగా సిటాడెల్: హానీ బన్నీ వెబ్ సిరీస్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సమంత రిలేషన్‌లో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. వీరిద్దరు చాలాకాలంగా డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. 
 
ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌ సమయంలోనే వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే రాజు నిడుమోరుకు ఇప్పటికే పెళ్లైంది. కానీ, ఆయన తన భార్యతో విభేదాలు రావడంతో ఆమెకు విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. 
Samantha Ruth Prabhu
 
ఈ నేపథ్యంలో సమంత మరోసారి ఆ దర్శకుడితో కలిసి కనిపించింది. ఈ ఫోటోలు వైరల్ కావడంతో సమంత రెండో పెళ్లి చేసుకోనుందనే టాక్. చెన్నై చాంపియన్స్‌కు సపోర్ట్ చేస్తున్న సామ్ వారితో ఫొటో దిగుతూ రాజ్ చేతి పట్టుకుని కనిపించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై?

ఈ రాత్రి నా భర్తను చంపేద్దాం.. ఆపై పామును వదిలేద్దాం.. పనైపోతుంది.. ప్రియుడితో..?

వైకాపాలో 2వ స్థానం నుంచి 2 వేల స్థానానికి చేర్చారు : విజయసాయి రెడ్డి (Video)

ఈపీఎఫ్‍‌వో వెర్షన్ 3.0తో సేవలు మరింత సులభతరం : కేంద్ర మంత్రి మాండవీయ

యునెస్కో రిజిస్టర్‌లో భగవద్గీత, నాట్యశాస్త్రం.. హర్షం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments