Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సమంత షాకింగ్ లుక్, ఏంటి బ్రో ఇలా అయ్యింది? (video)

Advertiesment
Samantha Ruth Prabhu

ఐవీఆర్

, బుధవారం, 18 డిశెంబరు 2024 (16:02 IST)
ఫోటో కర్టెసి- సోషల్ మీడియా
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత రూత్ ప్రభుకి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో సమంత చూసేందుకు చాలా సన్నగా రివటలా కనిపిస్తోంది. ఆమెను అలా చూసిన నెటిజన్లు షాక్ తింటున్నారు. ఏంటి బ్రో సమంత ఇలా తయారైంది... ఈ లుక్ రీసెంట్ దా లేదంటే పాతదా అంటూ ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. వీడియో ఎప్పటిదో తెలియదు కానీ ఇందులో సమంత మాత్రం చాలా సన్నగా కనిపిస్తోంది. ఆమె అలా వుండటం వెనుక కారణాలు ఏమిటో తెలియాల్సి వుంది.
 
కాగా ప్రస్తుతం బాలీవుడ్ సినిమా ఆఫర్లతో పాటు వెబ్ సిరీస్‌లతో సమంత బిజీగా వుంది. ఇటీవలే ఆమె విడాకులు తీసుకున్న హీరో నాగచైతన్య రెండో పెళ్లి చేసుకున్నారు. శోభిత దూళిపాళ్లతో నాగచైతన్య వివాహం జరిగింది. దీనిపై సమంత ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ ప్రస్తుతం సమంత లుక్ చూస్తుంటే ఆమె కాస్తంత ఆవేదనలో వున్నారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బచ్చల మల్లి సక్సెస్ తో ఈ ఏడాది ముగింపు బాగుండాలి : అల్లరి నరేష్