Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత అక్కినేని ఒప్పుకున్న తర్వాతి సినిమా ఇదే...

Webdunia
సోమవారం, 4 మే 2020 (14:22 IST)
మజిలీ, ఓ.. బేబీ చిత్రాలతో ఇటీవల సక్సస్ సాధించిన సమంత తదుపరి చిత్రం ఎవరితో చేయనుంది..? అనేది ఇప్పటివరకు ఎనౌన్స్ చేయలేదు. దీంతో సమంత నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ఆసక్తిగా మారింది. తమిళ దర్శకడుతో ఓ సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బాలీవుడ్ మూవీ చేయనున్నట్టుగా కూడా టాక్ వినిపించింది. 
 
తాజా వార్త ఏంటంటే... సమంత ప్రముఖ నిర్మాణ సంస్థ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చ‌ర్స్ బ్యానర్లో సినిమా చేయనున్నట్టు తెలిసింది. ఇది ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ అని.. ఓ కొత్త ద‌ర్శకుడు దీనికి దర్శకత్వం వహించనున్నారని టాక్. విభిన్న కథాంశంతో రూపొందే ఈ సినిమాని తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందిస్తున్నారు. 
 
ఈ మూవీకి సంబంధించి లాక్ డౌన్‌కి ముందే అగ్రిమెంట్స్ జ‌రిగాయని తెలిసింది. షూటింగ్ ఎప్పుడు మొద‌లైనా స‌రే... సింగిల్ షెడ్యూల్లో ఈ సినిమాని పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు‌. మ‌రోవైపు స‌మంత కోసం స‌రికొత్త క‌థ‌లు సిద్ధం అవుతున్నాయి. సింగీతం శ్రీ‌నివాస‌రావు ద‌ర్శ‌కత్వంలో బెంగ‌ళూరు నాగ‌ర‌త్న‌మ్మ‌ బ‌యోపిక్ రూపొందుతోంది. 
 
ఈ సినిమా కోసం సమంతని సంప్రదించినట్టు సమాచారం. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించనుంది. మరి.. ఈ బయోపిక్‌లో సమంత నటించనుందో లేదో త్వరలోనే క్లారిటీ రానుందని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments