Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫీక్రీ అలీ ప్రమోషన్స్‌కు డుమ్మా కొడుతున్న అమీజాక్సన్

ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌ వెండితెరపై క్రీడాకారుల జీవితాలు బయోపిక్‌గా తెరకెక్కుతున్నాయి. హాకీ, క్రికెట్‌, బాక్సింగ్‌, రన్నింగ్‌లు చూసిన ప్రేక్షకులు ఇప్పుడిక సరికొత్తగా గోల్ఫ్‌ను చూడబోతున్నారు. నవాజుద్దీన

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2016 (09:11 IST)
ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌ వెండితెరపై క్రీడాకారుల జీవితాలు బయోపిక్‌గా తెరకెక్కుతున్నాయి. హాకీ, క్రికెట్‌, బాక్సింగ్‌, రన్నింగ్‌లు చూసిన ప్రేక్షకులు ఇప్పుడిక సరికొత్తగా గోల్ఫ్‌ను చూడబోతున్నారు. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, అమీ జాక్సన్‌ ప్రధాన పాత్రలుగా నటిస్తున్న చిత్రం 'ఫ్రీకీ అలీ'. ''బజరంగీ భాయిజాన్''‌, ''హీరో'' చిత్రాలను నిర్మించిన సల్మాన్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్‌ తమ మూడో చిత్రంగా ''ఫ్రీకీ అలీ''ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. 
 
సల్మాన్‌ ఖాన్‌, సొహైల్‌ ఖాన్‌లు ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సోహైల్‌ఖాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అర్బాజ్‌ ఖాన్‌ కూడా ఈ చిత్రంలో ఓ ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు. 'ద పూర్‌ మ్యాన్‌ ఇన్‌ ద రిచ్‌మ్యాన్స్‌ స్పోర్ట్‌ హూ బికేమ్‌ ద గేమ్‌ ఛేంజర్‌' అన్న ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్రంలో కథానాయకుడు అలీ అనే గోల్ఫర్‌. సాధారణ కుటుంబానికి చెందిన అలీ గోల్ఫ్‌ ఛాంపియన్‌ ఎలా అయ్యాడనేది ఈ చిత్రం కథ. 
 
తాజాగా ఈ సినిమాకు సంబంధించి దిన్ మేనే కరేంగీ జాగ్రత్త అనే వీడియో సాంగ్‌ని రిలీజ్ చేశారు. కాగా అయితే సినిమా ప్రచార కార్యక్రమానికి అమీ రావడంలేదని సల్లూభాయ్‌ మండిపడుతున్నాడట. ఫ్రీకీ అలీ ప్రమోషన్స్‌ కోసం చిత్రబృందం ఓ టీవీ షోకి హాజరుకావాల్సి ఉన్న నేపథ్యంలో అమీకి హిందీ రాకపోవడంతో కార్యక్రమంలో ఏమన్నా మాట్లాడితే తన భాషను ఎవరన్నాహేళన చేస్తారన్న భయంతో అమీ ఆఖరి నిమిషంలో కార్యక్రమానికి రావడంలేదని చెప్పిందట. దాంతో సల్మాన్‌, సొహైల్‌ ఖాన్‌లు అమీపై పీకలదాకా కోపంగా ఉన్నట్లు బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే అమీ షోకి హాజరు కాకపోవడానికి ముఖ్య కారణం తను ముంబైలో లేకపోవడమేనని బంధువులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Rains Hit AP: నైరుతి రుతుపవనాలు.. ఏపీలో భారీ వర్షాలు

పహల్గామ్ సూత్రధారి : ఉగ్ర సంస్థగా 'టీఆర్ఎఫ్' - అగ్రరాజ్యం కీలక నిర్ణయం

వ్యభిచారం చేయలేదనీ వివాహితను కత్తితో పొడిచి చంపేసిన ప్రియుడు

ఆదిభట్లలో ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు - ముగ్గురి దుర్మరణం

అయ్యా... జగన్ గారూ.. పొగాకు రైతుల కష్టాలు మీకేం తెలుసని మొసలి కన్నీరు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments