Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేజు కోసం దేవకట్టా బాగానే సెట్ చేసాడుగా..?

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (13:27 IST)
మెగాహీరో సాయిధరమ్ తేజ్ తో దేవకట్టా ఓ సినిమా చేస్తున్నాడు. కరోనాకు ముందు ఈ సినిమాని స్టార్ట్ చేసారు. షూటింగ్ స్టార్ట్ చేద్దామనుకునే సరికి కరోనా రావడంతో ఆగింది. ఇప్పుడు షూటింగ్స్ స్టార్ట్ అవుతుండడంతో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది పొలిటికల్ మూవీ అని ఓ వార్త బయటకు వచ్చింది.
 
ఈ సినిమాలో కీలక పాత్రల కోసం రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్, జగపతి బాబులను తీసుకున్నారని సమాచారం. అయితే.. పవర్‌ఫుల్ పొలిటీషియన్‌గా రమ్యకృష్ణ కనిపించనున్నారు. ఐశ్వర్యరాజేష్ పాత్ర విషయానికి వస్తే... కేవలం గ్లామర్ డాల్‌గా కాకుండా, స్టఫ్ వున్న హీరోయిన్ క్యారెక్టర్లో కనపించనుంది. హీరో తండ్రి క్యారెక్టర్లో జగపతి బాబు కనిపించబోతున్నారు.
 
జగపతిబాబు, రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్.. ఈ కాస్టింగ్‌ను బట్టి ఇది ఎంతటి పవర్‌ఫుల్ స్టోరీనో అర్ధం అవుతుంది. ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 19 నుంచి షెడ్యూలు ప్రారంభించి సుమారు నలబై రోజుల పాటు కంటిన్యూగా షూట్ చేసేస్తారు. ఇంత లెంగ్తీ షెడ్యూలులో దాదాపు సగానికి పైగా సినిమా పూర్తయిపోతుంది.
 
ఈ నెల 12 నుంచి షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు కానీ.. సాయిధరమ్ తేజ్‌కి హెల్త్ బాగోలేకపోవడం వలనో లేక వేరో కారణంతోనో వారం వాయిదా వేసారని.. ఆ తర్వాత స్టార్ట్ చేయయనున్నారని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments