Webdunia - Bharat's app for daily news and videos

Install App

చచ్చిన పామును ఎన్నిసార్లు చంపుతారంటున్న హీరో

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (20:04 IST)
మెగా కుటుంబం నుంచి తెరంగేట్రం చేసిన హీరో సాయిధరమ్ తేజ్. చేసిన సినిమాలు ఆరుకి పైగానే ఉన్నా హిట్ల గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. చిత్రలహరి, ప్రతిరోజు పండుగే సినిమాలు సాయిధరమ్ తేజ్‌కు కాస్త కలిసొచ్చాయి. మిగిలిన సినిమాల గురించి చెప్పనవసరం లేదు.
 
మెగా ఫ్యామిలీ నుంచి కాబట్టి అన్నీ హిట్లు వస్తాయని తాను అనుకోవడం లేదని సాయిధరమ్ తేజ్ ఎన్నోసార్లు చెప్పాడు. సినిమా విజయం, అపజయం అనేది ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుందని... మంచి కథ ఉంటే ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పాడు. అయితే సాయిధరమ్ తేజ్ సుప్రీమ్, సుబ్రమణ్యం ఫర్ సేల్ లాంటి సినిమాలు తీసేటప్పుడు తిక్క అనే సినిమాను ఒప్పుకున్నాడు.
 
ఆ రెండు సినిమా షూటింగ్‌లు జరిగేటప్పుడే ఈ సినిమా షూటింగ్ చేయడం ప్రారంభించాడు. అయితే ఆ సినిమా కాస్త మొదటగానే పూర్తయ్యింది. కానీ హిట్ మాత్రం కాలేదు. భారీ ఫ్లాప్ అయ్యింది. దీంతో సాయిధరమ్ తేజ్ పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. ఆ సినిమా ఫ్లాప్ నుంచి బయటకు రావడానికి సాయికి చాలా సమయం పట్టింది.
 
అయితే అదంతా పూర్తిగా మర్చిపోయి ప్రతిరోజు పండుగ సినిమా విజయవంతంపై సంతోషంగా ఉంటూ మరో సినిమాకు రెడీ అవుతున్న సమయంలో కరోనా వచ్చిపడింది. ప్రస్తుతం ఒక ఛానల్ తిక్క సినిమాను పదేపదే టెలికాస్ట్ చేస్తోందట. ఇది కాస్త చూసిన సాయిధరమ్ తేజ్ మళ్ళీ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడట. 
 
ఫెయిలైన సినిమాను ఇన్నిసార్లు ప్రేక్షకులకు చూపించడం అవసరమా అంటూ కోపంతో ఉన్నాడట సాయిధరమ్ తేజ్. ఎప్పుడు కరోనా మహమ్మారి పోతుందో.. మళ్ళీ సినిమా షూటింగ్‌కు ఎప్పుడు వెళదామా అని సాయిధరమ్ తేజ్ కాచుకు కూర్చున్నాడట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

దుర్భాషలాడిన భర్త.. ఎదురు తిరిగిన భార్య - పదునైన ఆయుధంతో గుండు గీశాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments