Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మాత 'దిల్' రాజుకే నో చెప్పిన హీరోయిన్?

Webdunia
గురువారం, 5 నవంబరు 2020 (09:39 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్యామిలీ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన అతికొద్ది మంది హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. ఈమె సినిమాల్లో పాత్రల ఎంపికలో చాలా స్పష్టంగా ఉంటుంది. పైగా, పాత్ర నచ్చకపోతే.. కోట్లాది రూపాయలు ఇస్తామన్నా ఆమె అంగీకరించరు. అది ఎంత పెద్ద బ్యానర్ అయినా.. అగ్ర దర్శకుడు, బడా నిర్మాత అయినాసరే.
 
తాజాగా అలాంటి సంఘటనే ఒకటి ఎదురైనట్టు ఫిల్మ్ నగర్‌లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఓ స్టార్‌ ప్రొడ్యూసర్‌ సినిమాను సాయిపల్లవి రిజెక్ట్‌ చేసినట్టు సమాచారం. ఆ బడా నిర్మాత ఎవరో కాదు.. 'దిల్' రాజు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
దర్శకుడు అనీల్‌ రావిపూడి తదుపరి సినిమాను చేయడానికి సమయం పట్టేలా ఉండటంతో, మధ్యలో ఓ లేడీ ఓరియెంటెడ్‌ సినిమా చేయడానికి దిల్ రాజు ప్లాన్ చేశారట. ఆ చిత్రంలోని పాత్రకు సాయిపల్లవి అయితే సరిగ్గా సరిపోతుందని రాజు భావించారు. ఆ వెంటనే సాయిపల్లవిని సంప్రదిస్తే.. సాయిపల్లవి సున్నితంగా నో చెప్పేసిందని సమాచారం. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

పెళ్లి కాలేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments