Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లినవుతుండటం చాలా సంతోషంగా ఉందంటున్న సాయి పల్లవి

పెళ్ళి కాకుండా సాయిపల్లవి తల్లవడం ఏంటి.. అందులోను సంతోషపడటం ఏంటి అనుకుంటున్నారా.. ఇదంతా సినిమాలోలేండి.. కరు అనే తమిళ చిత్రంలో నటిస్తున్న సాయిపల్లవి అందులో తల్లి పాత్ర చేస్తోంది. ఆ క్యారెక్టర్ చాలా ప్రాధాన్యమున్నది. అలాంటి క్యారెక్టర్ చేస్తుండటం చాలా

Webdunia
శనివారం, 24 మార్చి 2018 (20:33 IST)
పెళ్ళి కాకుండా సాయిపల్లవి తల్లవడం ఏంటి.. అందులోను సంతోషపడటం ఏంటి అనుకుంటున్నారా.. ఇదంతా సినిమాలోలేండి.. కరు అనే తమిళ చిత్రంలో నటిస్తున్న సాయిపల్లవి అందులో తల్లి పాత్ర చేస్తోంది. ఆ క్యారెక్టర్ చాలా ప్రాధాన్యమున్నది. అలాంటి క్యారెక్టర్ చేస్తుండటం చాలా సంతోషంగా ఉందని అంటోంది. కుటుంబ నేపథ్యంలో సాగే చిత్రంలో తల్లిగా తన పాత్ర అద్భుతంగా ఉంటుందనీ, తమిళ సినిమాలో ఇలాంటి క్యారెక్టర్ మొదటగా చేస్తుండటం తన స్నేహితులకు అస్సలు ఇష్టం లేదని అంటోంది. 
 
''తక్కువ వయస్సులో తల్లి క్యారెక్టర్ చేస్తే ఆ తరువాత అవకాశాలు రావని చెబుతున్నారు. కానీ అదంతా నేను పట్టించుకోలేదు. నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అది. సినిమా విడుదలైన తరువాత నా స్నేహితులు చూస్తే ఖచ్చితంగా నన్ను మెచ్చుకుంటారన్న నమ్మకం ఉంది'' అంటోంది.
 
తెలుగులో కంటే తమిళంలోనే అవకాశాలు ఎక్కువగా సాయిపల్లవికి వస్తున్నాయట. ఇప్పటికే ధనుష్‌తో మారి-2 సినిమాలో నటిస్తుండగా, అగ్రహీరో సూర్యతో కూడా మరో సినిమా ఛాన్స్ వచ్చింది. అలాగే మరికొంతమంది యువ నటులతో కూడా నటించే అవకాశం సాయిపల్లవికి వచ్చిందట. దీంతో సాయిపల్లవి కోలీవుడ్‌లో సెటిల్ అయ్యిందని ప్రచారం బాగా జరుగుతోంది. కానీ సాయిపల్లవి మాత్రం నాకు ఏ పరిశ్రమ అయినా ఒకటే. కాకుంటే నాకు నచ్చిన క్యారెక్టర్ ఉంటే ఆ సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశ విడిచి పారిపోలేదు.. రష్యా సైన్యం రక్షించింది.. : సిరియా అధ్యక్షుడు అసద్

తాంత్రికుడి మాటలు నమ్మి బతికున్న కోడిపిల్లను మింగేశాడు..

దేశంలోనే అత్యంత ఆరోగ్యకరమైన గ్రామంగా బొమ్మసముద్రం

18న మార్చి నెల శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లు

అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం : ఐదుగురి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments