Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రగ్యా జైస్వాల్‌కు కెమిస్ట్రీ పాఠాలు బోధిస్తున్న కృష్ణవంశీ...

సందీప్ కిషన్ హీరోగా రెజీనా హీరోయిన్‌గా కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం నక్షత్రం. ఈ సినిమాలో చిన్న హీరో తనీష్… విలన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. అంతేకాక ఈ చిత్రంలో ఓ కీలకమైన పా

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2016 (14:30 IST)
సందీప్ కిషన్ హీరోగా రెజీనా హీరోయిన్‌గా కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం నక్షత్రం. ఈ సినిమాలో చిన్న హీరో తనీష్… విలన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. అంతేకాక ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర కోసం ఇప్పటికే సాయిధర్మతేజ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు కంచె హీరోయిన్ ప్రగ్యా  జైస్వాల్ కూడా నక్షత్రంలో చేరింది. 
 
ఈ విషయాన్ని కృష్ణవంశీ తన ఫేస్‌బుక్ ఎకౌంట్ ద్వారా తెలియజేశాడు. హరివిల్లు లాంటి అందమైన ''నక్షత్రం''లో అందాల భామ ప్రగ్యా జైస్వాల్ మెరవనుందని తెలిపాడు. ప్రగ్యా జైస్వాల్ ఓ శక్తివంతమైన పోలీస్ పాత్రలో సాయిధరమ్ తేజ్‌కు ఆపోజిట్‌గా నటించబోతోంది. ఇదిలావుంటే... కృష్ణ‌వంశీ ఏ సినిమా తీసినా హీరోహీరోయిన్ల‌పై ప్ర‌త్యేకంగా శ్రద్ధ వహిస్తుంటాడు. వాళ్లిద్ద‌రికీ సినిమాపట్ల విలువైన స‌ల‌హాలు ఇస్తుంటాడు.
 
ఈ మ‌ధ్య న‌క్ష‌త్రం సినిమా విష‌యంలో కూడా సాయిధ‌ర‌మ్ తేజ్‌, ప్ర‌గ్యా జైస్వాల్‌కి కృష్ణ‌వంశీ బోలెడ‌న్ని కెమిస్ట్రీ పాఠాలు చెప్పాడ‌ట‌. ఆ పాఠాల‌కి అనుగుణంగానే ఆ ఇద్ద‌రూ డేటింగ్‌లు కూడా మొదలుపెట్టారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అదే సినిమాలో రెజీనా న‌టిస్తున్న‌ప్ప‌టికీ సాయిధ‌ర‌మ్ తేజ్ మాత్రం ప్ర‌గ్యాతో చెట్ట‌ప‌ట్టాలేసుకొని తిరుగుతున్నాడ‌ట‌. దీంతో వారిద్ద‌రి మ‌ధ్య డేటింగ్ మ‌రో స్థాయికి వెళ్లింద‌ని టాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chicken Fair: మాంసాహార ఆహార ప్రియులను ఆకట్టుకున్న చికెన్ ఫెయిర్

ప్రియుడితో కలిసివుండేందుకు సొంతిల్లు నిర్మించుకోవాలని కన్నబిడ్డ కిడ్నాప్!!

స్నానానికి పనికిరాని గంగానది నీరు.. చేపల పెంపకానికి భేష్!!

డీకే శివకుమార్ సీఎం కాకుండా ఎవరూ అడ్డుకోలేరు : వీరప్ప మొయిలీ

వంద డిగ్రీల వేడిలో చికెన్ ఉడికించి ఆరగిస్తే బర్డ్ ఫ్లూ సోకదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments