Webdunia - Bharat's app for daily news and videos

Install App

''అజ్ఞాతవాసి'' నిర్మాతపై ప్రశంసలు.. డిస్ట్రిబ్యూటర్లను అలా ఆదుకున్నాడట..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ నటించిన చిత్రం అజ్ఞాతవాసి. సంక్రాంతికి ముందు విడులైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడింది. దీంతో అభిమానులు సైతం నిరాశలో కూరుకుపోయారు. అయితే భా

Webdunia
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (17:15 IST)
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ నటించిన చిత్రం అజ్ఞాతవాసి. సంక్రాంతికి ముందు విడులైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడింది. దీంతో అభిమానులు సైతం నిరాశలో కూరుకుపోయారు. అయితే భారీ మొత్తానికి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను కొనేశారు.

కానీ ఈ సినిమా విజయవంతం కాకపోవడంతో.. ప్రాంతాల వారీగా తీసుకున్నవారంతా నష్టాల్లో మునిగిపోయారు. ఫలితంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు రూ.14కోట్ల మేర నష్టపోయినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. 
 
ఈ సినిమా ద్వారా డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకూడదనే ఉద్దేశంతో నిర్మాత రాధాకృష్ణ ప్రయత్నాలు చేపట్టారట. ఆ నష్టాల నుంచి వాళ్లను గట్టెక్కించేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. ఇందులో భాగంగానే దిల్ రాజుకు రాధాకృష్ణ రూ.7 కోట్ల వరకు చెల్లించారని టాక్ వస్తోంది. అలాగే మిగిలిన డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఫోన్ కాల్స్ వెళ్లాయని.. వారందరికీ రాధాకృష్ణ కొంత నష్టపరిహారం చెల్లించినట్లు సమాచారం.
 
మరికొంతమందికి తర్వాత ప్రాజెక్టుకు సంబంధించిన కమిట్‌మెంట్లు ఇస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో అజ్ఞాతవాసి నిర్మాత తీసుకున్న నిర్ణయం పట్ల డిస్ట్రిబ్యూటర్లు హర్షం వ్యక్తం చేయడంతో పాటు రాధాకృష్ణను అభినందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments