Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్‌తో సందీప్ రెడ్డి వంగా చిత్రం.. స్పిరిట్‌లో కొరియన్ యాక్టర్?

సెల్వి
సోమవారం, 8 జులై 2024 (20:34 IST)
Prabhas_Korean Actor
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన తదుపరి చిత్రంలో ప్రభాస్‌తో కలిసి పని చేయనున్నారు. దర్శకుడు సినిమా టైటిల్‌ను స్పిరిట్‌గా ప్రకటించాడు. ఈ సినిమా పనులు ఇంకా ప్రారంభం కాలేదు.  అయితే ఈ సినిమాలో ఓ కొరియన్ యాక్టర్‌ని తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. 
 
ఈ చిత్రంలో దక్షిణ కొరియా నటుడు మా డాంగ్-సియోక్ విలన్‌గా ఎంపికయ్యారని సోషల్ మీడియా కోడైకూస్తోంది. మా డాంగ్-సియోక్ జోంబీ చిత్రం ట్రైన్ టు బుసాన్‌తో బాగా పాపులర్ అయ్యాడు. ఇంకా ఎంసీయూ ఎటర్నల్స్, ది అవుట్‌లాస్, అన్‌స్టాపబుల్, ది బ్యాడ్ గైస్: రీన్ ఆఫ్ ఖోస్, ది గ్యాంగ్‌స్టర్, ది కాప్, ది డెవిల్‌లో కూడా కనిపించాడు.
 
కానీ, సందీప్ రెడ్డి వంగా నటీనటుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించలేదని, ప్రభాస్ మినహా మరెవరినీ ఇంకా ఖరారు చేయలేదని చిత్ర యూనిట్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. గతంలో త్రిప్తి దిమ్రీ కథానాయికగా నటిస్తుందని పుకార్లు వచ్చాయి. కానీ దర్శకుడు దానిని ఖండించాడు. తారాగణం, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments