Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కల్కి చిత్రంపై విమర్శలకు నాగ్ అశ్విన్ మైండ్ బ్లోయింగ్ స్టేట్ మెంట్ !

Nag Ashwin

డీవీ

, శనివారం, 6 జులై 2024 (12:25 IST)
Nag Ashwin
కల్కి సినిమా విడుదలయ్యాక పలువురు పలురకాల విమర్శలు, ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో అదిరిపోయే సినిమా తెలుగులో తీశారని కొందరంటే, అసలు మహాభారతంనుంచి కలికాలంలో కర్ణ పాత్ర గురించి పలువిమర్శలు వచ్చాయి. కొందరైతే మేథావులను సంప్రదించకుండా తీశారని కూడా విమర్శించారు. దానికి నాగ్ అశ్విన్ ఏమన్నారంటే...
 
భారతమే అయినా కల్కి 2898 నాకున్న ఐడియాతోనే తీశా. కల్కి సంవత్సరంకు నేను తీసుకున్న కాలానికి లింక్ చేస్తూ టైటిల్ పెట్టాను.  మాయాబజార్ కూడా మహాభారతం నుంచి తీసుకుని సినిమా చేశారు. అదీ కల్పితమే. నేను తీసిన కల్కి కూడా కల్పితమే. దీనికోసం నేను ప్రవచనకారులనెవరినీ సంప్రదించలేదు. నాకున్న ఐడియాతో కథను రాసుకుని ఇలా వుంటే ఈ పాత్ర ఎలా వుంటుంది? అనేది కాగితంపై రాసుకుని తెరపై ఆవిష్కరించాను.
 
పిల్లలు కూడా ఎట్రాక్ట్ అయ్యేలా ప్రభాస్ ను కామియో చూపించాను. విజువల్ వండర్ గా తీర్చిదిద్దాను. అదేవిధంగా శంబాలా అనే ప్రాంతం కూడా నా విజనే. అక్కడ మరియమ్మతోపాటు పలుదేశాల  ప్రజలకు కనిపిస్తారు. క్రిస్టియన్ ముస్లింల పేర్లుకూడా పెట్టాను. ఇదంతా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షుకులను మెప్పించే ప్రయత్నమే తప్పిదే భారతాన్ని కించపరడానికి తీయలేదు.
 
కల్కి పుట్టుక సమయంలో క్రిష్ణుడు, అశ్వథ్తామ మాత్రమే వుంటారు. కానీ కర్ణుడు ఎలా వచ్చాడు? మహాసంగ్రామంలో చనిపోయినవారికి వీరమరణం వుంటుంది. మరో జన్న వుండదు. కర్ణుడు ఎందుకు పుట్టాడు? అనేది ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ. ఇదంతా నా క్రియేషన్. ఎదుకంటే భారతంలో కర్ణుని పాత్రను ఉత్తరాదిలో ప్రేమిస్తారు. విదేశీయులు కూడా ప్రేమిస్తారు అని సమాధాన ఇచ్చారు.
 
ఇలా ప్రతి విమర్శలకు ఆయన తనదైన శైలిలో సమాధానమిస్తూ. రెండో భాగంలో కర్ణుడు ఎందుకు పుట్టాడు? అనేది క్లారిటీగా చూపిస్తాం. అర్జునుడు పాత్ర కూడా వివరంగా వుంటుంది. అలాగే కమల్ హాసన్ పాత్ర, దుల్కర్ సల్మాన్ పాత్ర ఇలా పలు పాత్రలకు సమాధాన రెండో భాగంలోనే మీకు అర్థమవుతుంది అన్నారు.
 
కల్కి మొదటి భాగం ముక్కలుముక్కులుగా వుంది? కంటెన్యూ లేదు? అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ. ఇందులో ప్రతి పాత్ర గురించి ఒక్కో సినిమా తీసే అవకాశం వుంది. పాత్రలన్నింటినీ పరిచయం చేయడానికే మొదటి పార్ట్ సరిపోయింది. అప్పటికే ఇంకా ఎక్కువ చెబితే బోర్ కొడుతుంది. అందుకే చాలా తగ్గించామని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శనివారాల్లో వైలెంట్ గా వుండే సూర్య కథే సరిపోదా శనివారం !