Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ఓ పబ్లిక్ ఫిగర్‌ను.. నా అందాలు ఎక్స్‌పోజింగ్ చేస్తే తప్పేంటి : అనసూయ

తన దుస్తులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఓ నెటిజన్‌కు సినీ నటి, బుల్లితెర యాంకర్ అనసూయ క్లాస్ పీకింది. అన‌సూయ‌ ధరిస్తున్న దుస్తులు అభ్యంతరక‌ర‌మ‌ని ఓ నెటిజ‌న్ పేర్కొన్న విషయం తెల్సిందే. అన‌సూయ‌కు ఏమైన

Webdunia
బుధవారం, 30 ఆగస్టు 2017 (06:05 IST)
తన దుస్తులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఓ నెటిజన్‌కు సినీ నటి, బుల్లితెర యాంకర్ అనసూయ క్లాస్ పీకింది. అన‌సూయ‌ ధరిస్తున్న దుస్తులు అభ్యంతరక‌ర‌మ‌ని ఓ నెటిజ‌న్ పేర్కొన్న విషయం తెల్సిందే. అన‌సూయ‌కు ఏమైనా సెన్స్‌ ఉందా? అని కామెంట్ చేశాడు. ఈ ఎక్స్‌పోజింగ్‌ ఏంటి? అని నిల‌దీశాడు. కుటుంబంతో కలిసి తాము టీవీ కార్యక్రమాలు చూడలేకపోతున్నామ‌ని పేర్కొన్నాడు. ఆ కామెంట్ చూసిన అన‌సూయ‌కు చిర్రెత్తుకొచ్చింది.
 
ఈ కామెంట్ చూసిన అన‌సూయ‌కు చిర్రెత్తుకొచ్చింది. దీనిపై అనసూయ స్పందిస్తూ 'అలాగైతే ఆ ప్రోగ్రాంల‌ను చూడ‌కు అంటూ సలహా ఇచ్చింది. కుటుంబ విలువలపై అంతగా పట్టింపు ఉన్న వ్య‌క్తి ఇతరుల విషయాల్లో తలదూర్చకూడదని హిత‌వుప‌లికింది. ఇతరులు ఎటువంటి దుస్తులు వేసుకోవాలో ఇలా చెప్ప‌కూడ‌ద‌ని పేర్కొంది. ఒక మహిళ, అమ్మ, భార్య అయిన త‌న‌లాంటి పబ్లిక్‌ ఫిగర్‌తో మాట్లాడే స్వేచ్ఛను తీసుకోవ‌ద్ద‌ని ఘాటుగా క్లాస్ పీకింది. తాను ఏ దుస్తులు వేసుకోవాలో త‌న‌కు తెలుస‌ని, మ‌నుషులు ఏం చూడాలనుకుంటే అదే చూస్తారని తెలిపింది. 
 
చిన్నారుల‌పై లైంగిక వేధింపులు ఎందుకు జరుగుతున్నాయని, 65 ఏళ్ల వృద్ధ మహిళలపై అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయని అనసూయ ప్ర‌శ్నించింది. వారేం ఎక్స్‌పోజింగ్ చెయ్య‌రు క‌దా? అని నిల‌దీసింది. ఇత‌రులకు ఇటువంటి సూచ‌న‌లు చేయొద్ద‌ని, 'నీ ప‌ని నువ్వు చూసుకో' అని మెత్తగా చురక అంటించింది. 

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం