Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంతానం పక్కన సాయిపల్లవి..!

ఫిదా సినిమా తరువాత సాయి పల్లవి దశ తిరిగిపోయింది. బాష అర్థం కాకున్నా అటు తమిళం ఇటు కన్నడంలోను ఫిదా సినిమాను ప్రజలు పిచ్చగా చూసేస్తున్నారు. సాయిపల్లవి యాక్టింగ్‌కు ఇప్పటికే ఫిదా అయిన తెలుగు ప్రేక్షకులు సాయిపల్లవి మరో సినిమా ఎప్పుడు వస్తుందా అన్న ఆతృతలో

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2017 (20:16 IST)
ఫిదా సినిమా తరువాత సాయి పల్లవి దశ తిరిగిపోయింది. బాష అర్థం కాకున్నా అటు తమిళం ఇటు కన్నడంలోను ఫిదా సినిమాను ప్రజలు పిచ్చగా చూసేస్తున్నారు. సాయిపల్లవి యాక్టింగ్‌కు ఇప్పటికే ఫిదా అయిన తెలుగు ప్రేక్షకులు సాయిపల్లవి మరో సినిమా ఎప్పుడు వస్తుందా అన్న ఆతృతలో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే తమిళంలో విజయ్ దర్శకత్వంలో కరు అనే చిత్రంలో నటిస్తోంది సాయిపల్లవి. తెలుగులో ఒక సినిమాకు సంతకం చేసేసింది. అటు తన మాతృభాష మళయాళంలోను రెండు సినిమాలతో బిజీగా ఉంది.
 
ఇలాంటి ఆఫర్లు ఉండగానే సాయిపల్లవికి మరో అవకాశం వచ్చింది. కమెడియన్‌గా నటనను ప్రారంభించి హీరోగా ఎదిగిన సంతానంతో ఇప్పుడు జత కట్టనుంది సాయిపల్లవి. ఇప్పటికే కథ మొత్తం సిద్థమైపోయింది. ఎం.రాజేష్‌ దర్శకత్వంలో చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది. దర్శకుడు రాజేష్‌ ఇప్పటివరకు చేసిన ఆరు చిత్రాలలో ఐదు హీరోకు సమానమైన పాత్రల్లో సంతానం నటించారు. అయితే ఈసారి  ఏకంగా హీరోగానే నటించేస్తున్నారు.

పర్యావరణ అనుకూల కార్యక్రమాలతో పర్యావరణ దినోత్సవ వేడుకలు నిర్వహించిన వెల్‌స్పన్‌

81 మంది కొత్త ఎమ్మెల్యేలతో కళకళలాడనున్న ఏపీ అసెంబ్లీ

టీటీడీలో ప్రక్షాళన: టీటీడీ ఛైర్మన్‌గా నాగబాబు.. ఆరోజున ప్రకటన

తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్‌లకు రుతుపవనాలు... భారీ వర్షాలు

35వేల మెజారిటీతో గెలుపు.. జనసేన వందశాతం స్ట్రైక్ రేట్ రికార్డ్

మజ్జిగ ఇలాంటివారు తాగకూడదు, ఎందుకంటే?

ఈ రసం తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయ్

ఖాళీ కడుపుతో లవంగాలను నమిలితే 7 ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

ఈ పదార్థాలు తింటే టైప్ 2 డయాబెటిస్ వ్యాధిని అదుపు చేయవచ్చు, ఏంటవి?

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

తర్వాతి కథనం
Show comments