Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ అక్కినేని - శ్రియా భూపాల్ రెడ్డి ఎందుకు విడిపోయారంటే.. లీకైన వ్యవహారం...

హీరో అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్ అక్కినేని - ప్రముఖ డిజైనర్ శ్రియా భూపాల్ రెడ్డిల వివాహం రద్దు కావడానికి కారణం వెలుగులోకి వస్తున్నాయి. ఈ వార్తల్లో ఏ మేరకు నిజం ఉందో తెలియదు. కానీ, అఖిల్‌త

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2017 (16:48 IST)
హీరో అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్ అక్కినేని - ప్రముఖ డిజైనర్ శ్రియా భూపాల్ రెడ్డిల వివాహం రద్దు కావడానికి కారణం వెలుగులోకి వస్తున్నాయి. ఈ వార్తల్లో ఏ మేరకు నిజం ఉందో తెలియదు. కానీ, అఖిల్‌తో బ్రేకప్ కాగానే, ఓ ఎన్నారైతో శ్రియా పెళ్లి ఫిక్సయిందన్న వార్తలూ వచ్చేశాయి. 
 
అయితే అఖిల్ అక్కినేనితో శ్రియ భూపాల్ తెగతెంపులు చేసుకోవడానికి కారణమేంటో వాస్తవంగా ఎవరికీ తెలియదు. దీనికి కారణం బ్రేకప్ విషయంపై రెండు కుటుంబాల నుంచీ స్పందన లేదు. వారి బ్రేకప్‌నకు సంబంధించి మరో కొత్త కారణం తెలుస్తోంది. పలు వెబ్‌సైట్లు ఆ కారణం వల్లే వారిద్దరూ విడిపోయారని కథనాలు ఇచ్చాయి.
 
వాస్తవానికి వెంటనే పెళ్లి చేసుకోవాలని శ్రియా భూపాల్ ఇంటి తరపు నుంచే ఒత్తిడి ఎక్కువైందట. అయితే.. నటుడిగా తన కెరీర్ ఏంటో అప్పటికీ సందిగ్ధంలోనే ఉండటంతో అఖిల్ తొలుత పెళ్లికి వెనుకాడడట. కెరీర్ కాస్తంత గాడిన పడిన తర్వాత పెళ్లి చేసుకుందామని వారికి చెప్పాడట. అయినా.. పెళ్లి కూతురు తరపు వారు ఒప్పుకోకపోవడంతో పెళ్లికి సిద్ధమయ్యాడట. 
 
ఇదే విషయం మరోసారి వారి మధ్య చర్చకు రావడంతో.. శ్రియా భూపాల్ కుటుంబ సభ్యులు నాగ్ ఫ్యామిలీతో చర్చలు జరిపారట. అయితే.. అఖిల్ రెండో సినిమా విడుదలయ్యాక పెళ్లి చేద్దామని నాగ్ చెప్పినా వారు వినిపించుకోలేదట. అదేవారి మధ్య అభిప్రాయ భేదాలకు కారణమై అఖిల్-శ్రియల పెళ్లి ఆగిపోవడానికి కారణమైందని టాక్. అయితే, ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి వుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments