Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళి మల్టీస్టారర్‌లో విలన్‌గా రవితేజ.. అల్లు అర్జున్ పాత్ర ఎలా వుంటుంది?

బాహుబలి మేకర్ రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న మల్టీస్టారర్ మూవీలో విలన్‌గా మాస్ మహారాజ రవితేజ నటించనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ''టచ్ చేసి చూడు'' చిత్రంతో తన నటనను మ

Webdunia
శనివారం, 3 ఫిబ్రవరి 2018 (10:03 IST)
బాహుబలి మేకర్ రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న మల్టీస్టారర్ మూవీలో విలన్‌గా మాస్ మహారాజ రవితేజ నటించనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ''టచ్ చేసి చూడు'' చిత్రంతో తన నటనను మరోసారి నిరూపించుకున్న రవితేజ.. రాజమౌళి మల్టీస్టారర్‌లో విలన్‌గా నటించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే రాజమౌళి మల్టీస్టారర్‌లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు వున్నారు. 
 
వీరితో పాటు తాజాగా రవితేజ, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇందులో చెర్రీ, ఎన్టీఆర్ బాక్సర్లుగా, సోదరుగా కనిపించనున్నారు. ఇక రవితేజ విలన్‌గా దర్శనమివ్వనున్నాడని.. అయితే అల్లు అర్జున్ రోల్ ఎలా వుంటుందనే దానిపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
 
అయితే ఈ సినిమాపై వార్తలు, వదంతులు వస్తున్నాయే కానీ ఇంకా బాహుబలి మేకర్ రాజమౌళి నుంచి గానీ, చెర్రీ, జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం రాజమౌళి మల్టీస్టారర్ సినిమా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సంగారెడ్డిలో చిరుతపులి కలకలం.. దూడను చంపింది.. నివాసితుల్లో భయం భయం

ప్రియుడి మోజులో పడి భర్తను, 22 ఏళ్ల కుమార్తెను చంపిన మహిళ

Viral Video: ఏడేళ్ల క్రితం కనిపించకుండా పోయాడు.. వైరల్ రీల్స్‌తో దొరికిపోయాడు..

2.0 రప్ప రప్ప డైలాగ్- ఎరుపు రంగులో, గొడ్డలి గుర్తుతో రాశారు - వీడియో వైరల్

Kavitha: స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టిన కేసీఆర్.. కలిసొస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments