అది నేర్చుకోవడంలో నేను నిత్యవిద్యార్థినే అంటున్న రాశీ ఖన్నా

Webdunia
గురువారం, 28 మే 2020 (17:43 IST)
రాశీఖన్నా విద్యార్థి అవతారమెత్తడమేంటి.. సినిమాలో విద్యార్థిగా నటిస్తోంది.. ఇప్పుడు షూటింగ్‌లు లేవు కదా. రాశీ ఖన్నా ఉన్నట్లుండి విద్యార్థినిగా మారిపోవడం ఏంటని అందరూ అనుకుంటున్నారు కదా. అదేమీ లేదండి.. లాక్ డౌన్ సమయంలో ఖాళీగా ఉండడం ఇష్టం లేని రాశీ ఖన్నా తమిళం నేర్చుకుంటోందట.
 
తెలుగులో కాదు తమిళంలోను రాశీకి మంచి ఆఫర్లే వస్తున్నాయట. దీంతో రాశీ ఖన్నా తమిళం నేర్చుకోవాలని లాక్ డౌన్ ముందే అనుకున్నదట. షూటింగ్ చేస్తూనే తమిళం నేర్చుకోవడానికి గంట సమయం కేటాయించాలని నిర్ణయించుకుందట. అయితే ఉన్నట్లుండి లాక్ డౌన్ రావడం.. షూటింగ్‌లు ఆగిపోవడం జరిగిపోయాయి. 
 
ఇది కాస్త రాశీ ఖన్నాకు బాగా కలిసొచ్చింది. అందుకే రాశీ ఖన్నా తమిళంలో తన గురువు మిస్ లీలతో ఆన్ లైన్లో క్లాస్‌లు నేర్చుకుంటోందట. తాను విద్యార్థిని అయిపోయానంటూ ల్యాప్ టాప్ చేతిలో పట్టుకుని ఒక ఫోటోకు ఫోజిచ్చి ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది అమ్మడు. ఆ ఫోటోకు కాస్త అభిమానులు తెగ సందేశాలను పంపించేస్తున్నారట.
 
చిన్నప్పుడు ఎప్పుడో స్కూలుకు వెళ్ళి చదువుకున్నాను. మళ్ళీ ఇప్పుడు విద్యార్థినిగా మారిపోయి చదువుకుంటున్నాను. నేను నిత్యవిద్యార్థిని అంటూ పోస్ట్ చేసిందట రాశీ ఖన్నా. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక సమస్యలు.. పెంచలేక ముగ్గురు కుమార్తెలను చంపేసిన తండ్రి

మిస్టర్ జగన్.... సీఎంగా ఉన్నపుడే ఏం పీకలేకపోయావ్... నా జోలికి రావొద్దు : శివాజీ హెచ్చరిక

ఇరాన్ పౌరులూ... గృహాలను వీడి బయటకు రావొద్దు : అమెరికా హెచ్చరిక

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త.. ఆపై లొంగిపోయాడు..

Telangana: తెలంగాణలో పడిపోనున్న పగటి ఉష్ణోగ్రతలు.. భారీ వర్షాలకు ఛాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో గర్భిణీస్త్రీలు ఆరోగ్యం

కిడ్నీలలో సమస్యలు మొదలయ్యాయని చెప్పే లక్షణాలు ఇవే

కౌమారదశ బాలికలకు పరిశుభ్రత కిట్ పంపిణీతో మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

తర్వాతి కథనం
Show comments