Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుల్కర్ సల్మాన్- సోనమ్ కపూర్‌కి సారీ చెప్పిన రానా.. ఎందుకు?

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2023 (15:04 IST)
అభిలాష్ జోషి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటించిన చిత్రం 'కింగ్ ఆఫ్ కోథా'. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్-వేఫేరర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జేక్స్ బిజోయ్- షాన్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి నిమిష్ రవి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 
 
ఈ సినిమా ఓనం రోజున థియేటర్లలోకి రానుంది. ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్‌ను నిర్వహించారు. దీనికి నటులు నాని, రానా దగ్గుబాటి హాజరయ్యారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ.. 'నటుడు దుల్కర్‌ సల్మాన్‌ ఓ ప్రముఖ హిందీ చిత్రంలో నటిస్తుండగా.. బాలీవుడ్‌లోని ప్రముఖ హీరోయిన్‌ ఒకరు షూట్‌ మధ్యలో తన భర్తతో కలిసి ఫోన్‌లో షాపింగ్ చేస్తూ కనిపించారు. 
 
షాపింగ్ వ్యవహారంలో ఆమెను ఆమే మరిచిపోయారు. లండన్‌లో భర్త షాపింగ్ చేస్తుంటే.. ఆమె అతనితో మాట్లాడుతూ.. సీన్ టేకులు తీసుకుంటూ.. ఫోన్‌లో మాట్లాడుతూ కనిపించింది. దీన్ని దుల్కర్ చాలా ఓపిగ్గా చూస్తుండిపోయాడు. అంటూ సోనమ్ కపూర్‌ను ఉద్దేశించి రానా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై రానా ప్రస్తుతం స్పందించాడు. తన వ్యాఖ్యలు తప్పే బాబోయ్ అంటూ చెప్పాడు. నెగటివిటీని తట్టుకోలేకపోతున్నానని చెప్పాడు.  
 
ఇంకా రానా తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. అందులో, "సోనమ్ కపూర్ గురించి నేను చెప్పింది పూర్తిగా అబద్ధం. స్నేహితులుగా, మేము తరచుగా సరదాగా సరదాగా మాట్లాడుకుంటాము. 
 
నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నందుకు చాలా చింతిస్తున్నాను. సోనమ్, దుల్కర్ ఇద్దరికీ నా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఈ పోస్ట్ పెడతారని ఆశిస్తున్నాను. అపార్థానికి ఇలా ముగింపు చెప్తున్నాను" అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హథ్రాస్ తొక్కిసలాటలో 122 మందికి చేరుకున్న మృతుల సంఖ్య!!

పెళ్లికి నిరాకరించాడని బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్ కట్ చేసిన డాక్టర్ (Video)

ఫార్చునర్ కారును బహుమతిగా ఇచ్చారు.. సున్నితంగా తిరస్కరించాను : పోలవరం ఎమ్మెల్యే (Video)

హైదరాబాదులో చైన్ స్నాచింగ్‌ల్లా మొబైల్ స్నాచింగ్‌- నలుగురి అరెస్ట్

బాబూ గారూ రండి.. మాట్లాడుకుందాం... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments