Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రిస్మస్‌కు రానున్న రాంగోపాల్ వర్మ 'వంగవీటి'.. షూటింగ్ షాట్లతో వీడియో రిలీజ్

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర‌లేదు. ఎవరి గురించైనా, ఏ విషయంలోనైనా నిర్మొహమాటంగా ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టిన‌ట్టు చెప్పే వ్య‌క్తి. అవ‌త‌లి వాడి ముఖం

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2016 (16:05 IST)
వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర‌లేదు. ఎవరి గురించైనా, ఏ విషయంలోనైనా నిర్మొహమాటంగా ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టిన‌ట్టు చెప్పే వ్య‌క్తి. అవ‌త‌లి వాడి ముఖం మీద కొట్టిన‌ట్టు ఉంటాయి ఆర్జీవీ కామెంట్స్.. అందుకే నిత్యం ఆయన చుట్టూ ఏదో ఒక వివాదం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉంటుంది. అర్థం కానీ ట్వీట్లతో వివాదాలు లేపే రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో వివాదానికి తెరలేపాడు.
 
ఆ మధ్య వినాయకచవితి రోజు విఘ్నేశుడి గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో గుర్తుండే ఉంటుంది. దేవుళ్ల మీద విమర్శలు చేయడానికి.. సెటైర్లు వేయడానికి ఏ సందర్భం వచ్చినా.. ఏ అవకాశం వచ్చినా వర్మ వదులుకోడు. దేవుళ్ల మీద తరుచూ.. సెటైర్లు వేసే వర్మ.. విజయదశమి రోజు తన కొత్త సినిమా ''వంగవీటి''కి సంబంధించిన ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియో మొదట్లోనే కనకదుర్గమ్మ ఆశీస్సులతో అని వేయడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ ఆలోచన వర్మే చేసి ఉంటే ఇది కూడా ఒకరకమైన సెటైరే అనుకోవాలి. 
 
''వంగవీటి'' లేటెస్ట్ వీడియోకు సంబంధించిన మరో విశేషం ఏంటంటే.. ట్రైలరో.. మేకింగ్ వీడియోనో.. ఒక పాటో రిలీజ్ చేస్తారు కానీ.. కొన్ని షాట్లతో వీడియో రూపొందించి రిలీజ్ చేయడం అన్నది ఇప్పటిదాకా తెలుగు సినిమాల్లో దేనికీ జరగలేదు. ఈ వీడియో ద్వారానే ''వంగవీటి'' రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశాడు వర్మ. క్రిస్మస్ కానుకగా డిసెంబరు 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments