Webdunia - Bharat's app for daily news and videos

Install App

"అప్సర రాణి"ని వర్మ అలా వాడేసుకుంటున్నారా?

Webdunia
బుధవారం, 19 మే 2021 (12:59 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ అప్సర రాణి. ఈమె పేరుకు మాత్రమే హీరోయిన్. ఇప్పటివరకు ఈమె కేవలం ఐటమ్ సాంగ్‌లకే పరిమితమైంది. కానీ, వర్మ తీసే చిత్రాల్లో మాత్రం బోల్డ్ పాత్రల్లో నటిస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. 
 
నిజానికి ఈమె అసలు పేరు అంకితా మహారాణ. ఒరిస్సా అమ్మాయి. 2019లో '4 లెటర్స్' సినిమా ద్వారా టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైది. ఆ తర్వాత 'ఊల్లాల ఊల్లాల' సినిమా చేసింది. రెండు సినిమాలు చేసినా ఈమె ఎవరో ఎవరికీ అంతగా తెలియలేదు. 
 
కానీ ఎప్పుడైతే సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ చూపులో పడిన అంకితా మహారాణి కాస్త అప్సర రాణిగా పేరు మార్చుకుంది. ఆ తర్వాత తన మార్క్ బోల్డ్ కంటెంట్‌తో తెరకెక్కించిన 'థ్రిల్లర్‌'తో అప్సర రాణిని హీరోయిన్‌గా పరిచయం చేశాడు. దీంతో ఆమె ఓవర్ నైట్ స్టార్ అనేంతగా క్రేజ్ వచ్చింది.
 
ఆ తర్వాత టాలీవుడ్ మేకర్స్ దృష్టి అప్సర మీదా బాగా పడింది. ఈ క్రమంలోనే మాస్ మహారాజ రవితేజ నటించిన 'క్రాక్' సినిమాలో 'భూమ్ బద్దల్' సాంగ్ చేసి బాగా పాపులర్ అయింది. అదేసమయంలో ఐటెం సాంగ్ అంటే స్టార్ హీరోయిన్ లేదా ముంబై బ్యూటీస్ ఉండాలని ఆలోచించే మేకర్స్ ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీ మీద ఫోకస్ పెట్టారు.
 
ఫలితంగానే గోపీచంద్ - తమన్నా నటించిన 'సీటీమార్' సినిమాలో కూడా అప్సర రాణికి ఐటెం సాంగ్ చేసే అవకాశం దక్కింది. అంతేకాదు మరికొన్ని సినిమాలలోనూ ఐటెం సాంగ్స్‌కు తన పేరునే పరిశీలిస్తున్నారట. ఒకవైపు ఇలా ఐటెంస్ సాంగ్స్ చేస్తూనే మరోవైపు వర్మ రూపొందించిన 'డేంజరస్‌' వంటి బోల్ద్ మూవీలో నటించింది. 
 
ఇందులోనూ ఈమె ఘాటుగా కనిపించనుంది. అయితే అప్సర రాణిలో హీరోయిన్ అయ్యే క్వాలిటీస్ బాగా ఉన్నాయని.. యంగ్ హీరోలకి మంచి జోడీ అనే టాక్ వినిపిస్తోంది. హీరోయిన్‌గా అవకాశాలు రావడం లేదా, లేక తనకే హీరోయిన్‌గా నటించే ఉద్దేశ్యం లేదా అనే విషయంలో ఆమెనే క్లారిటీ ఇవ్వాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్.. మద్దతు పలికిన అజిత్ పవార్

పుష్ప 2 ఎప్పుడొస్తుందా చూద్దామని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నా: అంబటి రాంబాబు (video)

విమానంలో విషపూరిత పాములు... వణికిపోయిన ప్రయాణికులు

స్పేస్ ఎక్స్ విమానంలో భూమికి తిరిగిరానున్న సునీత-విల్మోర్‌

చెవిరెడ్డి కూడా నాకు చెప్పేవాడా? నేను వ్యక్తిగత విమర్శలు చేస్తే తట్టుకోలేరు: బాలినేని కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments