Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి ఖైదీ 150 సినిమాలో చరణ్ స్టెప్పులు.. మెగాస్టార్‌తో కలిసి చిన్న బిట్‌లో?

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ 150వ సినిమా ఆడియో ఫంక్షన్ డిసెంబర్ 18న అట్టహాసంగా జరుగనుందని తెలుస్తోంది. లాంగ్ గ్యాప్ తర్వాత చిరంజీవి చేసే సినిమా ఇది కావడంతో ఆడియో వేడుకను అట్టహాసంగా నిర్వహించేందుకు రంగం సి

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2016 (11:22 IST)
మెగాస్టార్ చిరంజీవి ఖైదీ 150వ సినిమా ఆడియో ఫంక్షన్ డిసెంబర్ 18న అట్టహాసంగా జరుగనుందని తెలుస్తోంది. లాంగ్ గ్యాప్ తర్వాత చిరంజీవి చేసే సినిమా ఇది కావడంతో ఆడియో వేడుకను అట్టహాసంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఆడియో వేడుకకు మెగా హీరోలంతా హాజరవుతున్నారని.. ఫ్యామిలీ ఫంక్షన్‌లా ఈ ఆడియో వేడుక ఉంటుందని సినీ జనం అంటున్నారు. 
 
అయితే మెగా ఫ్యామిలీకి దూరంగా వుంటున్న పవన్ కల్యాణ్.. చిరంజీవి ఖైదీ 150 సినిమా ఆడియో ఫంక్షన్‌కి వెళ్తాడా? లేదా అనేదే ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. ర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుకకు అన్నయ్య చిరంజీవి వచ్చిన నేపథ్యంలో.. ఖైదీ 150 ఆడియో వేడుకకు కూడా తమ్ముడు రావాల్సిందేనని డిసైడైపోయారని సమాచారం.
 
ఈ నేపథ్యంలో ఫిల్మ్ నగర్‌లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. చిరంజీవి ఖైదీ సినిమాలోని ఒక పాటలో చరణ్ కనిపించనున్నాడని సమాచారం. 'ఖైదీ నెంబర్ 150' సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమా టీమ్ ఇటీవల విదేశాల్లో రెండు పాటలను చిత్రీకరించుకుని వచ్చింది. మరో పాటను హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 
 
ఈ పాట చిత్రీకరణ కోసం ప్రత్యేకమైన సెట్ వేస్తున్నారు. ఈ పాటలోని చిన్న బిట్‌లో చిరంజీవితో పాటు చరణ్ కూడా స్టెప్పులు వేయనున్నట్లు తెలుస్తోంది. చెర్రీ చరణ్ కోసం మగధీర, బ్రూస్ లీ సినిమాల్లో చిరూ కనిపించి ఫ్యాన్స్‌ను మురిపించారు. ప్రస్తుతం చిరంజీవి సినిమాలో చరణ్ మెరుస్తాడని సమాచారం. అదే గనుక జరిగితే మెగా ఫ్యాన్స్ ఇక పండగ చేసుకుంటారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments