రకుల్ ప్రీత్ సింగ్‌ను వెంటాడుతున్న దురదృష్టం!

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (08:20 IST)
కెరటం అనే చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ అనే చిత్రంలో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్లు వచ్చాయి. పలువురు స్టార్ హీరోల సరసన కూడా నటించింది. దీంతో మోస్ట్ వానెటెడ్ హీరోయిన్‌గా మారింది. అయితే ఎంత త్వరగా స్టార్ హీరోయిన్‌గా పాపులారిటీని దక్కించుకుందో అంతే త్వరగా క్రేజ్‌ని కోల్పోయింది. రామ్ చరణ్‌తో చేసిన 'ధృవ' సినిమా తరువాత మళ్ళీ రకుల్‌కి హిట్ అన్నది దక్కలేదు.
 
అగ్రహీరో నాగార్జునతో నటించిన 'మన్మథుడు 2' సినిమాకి నెటిజన్స్ నుంచి ట్రోల్స్ వచ్చాయి. ఇక రకుల్ ప్రీత్ సింగ్ సినిమా కెరీర్ దాదాపుగా క్లోజ్ అయినట్టే అన్న మాట వినిపిస్తున్న సమయంలో మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలని అంగీకరించి షాకిచ్చింది. 
 
ఇదేసమయమలో బాలీవుడ్ సినిమాలకి సైన్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే నితిన్‌తో నటించిన 'చెక్' సినిమా మళ్ళీ రకుల్ కెరీర్‌ని డైలమాలో పడేసింది. ఈ సినిమా మీద రకుల్ చాలా నమ్మకాలు పెట్టుకుంది. ఒకవేళ 'చెక్' సినిమా సూపర్ హిట్ అయి ఉంటే రకుల్ జోరు ఇప్పుడు వేరేలా ఉండేది. కానీ అన్నీ తారుమారయ్యాయి. 
 
ప్రస్తుతం తెలుగులో క్రిష్ - వైష్ణవ్ తేజ్‌ల సినిమా ఒక్కటే చేతిలో ఉంది. ఈ సినిమా గనక హిట్ అయితే రకుల్ మళ్లీ తెలుగులో నిలదొక్కుకోగలదు. లేనిపక్షంలో మూటాముల్లె సర్దుకోవాల్సి వస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పరకామణి దొంగతనం కేసు.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నివేదికను సమర్పించిన సిట్

పెట్టుబడుల కోసం అమెరికాలో పర్యటించనున్న నారా లోకేష్

అత్తగారింట్లో అడుగుపెట్టిన అర గంటకే విడాకులు - కట్నకానుకలు తిరిగి అప్పగింత

Karnataka: 13 ఏళ్ల బాలికను చెరకు తోటలోకి లాక్కెళ్లి అత్యాచారం.. నిందితుడి అరెస్ట్

జనాభా పెంచేందుకు చైనా వింత చర్య : కండోమ్స్‌లపై 13 శాతం వ్యాట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments