Webdunia - Bharat's app for daily news and videos

Install App

రకుల్ ప్రీత్ సింగ్ సక్సెస్ సీక్రెట్ ఏంటో...

ప్రస్తుతం టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా తన హవాను కొనసాగిస్తున్న అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ''ధ్రువ'' సినిమాలో కథానాయికగా నటిస్తోంది రకుల్. టాలీవుడ్‌

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2016 (10:21 IST)
ప్రస్తుతం టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా తన హవాను కొనసాగిస్తున్న అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ''ధ్రువ'' సినిమాలో కథానాయికగా నటిస్తోంది రకుల్. టాలీవుడ్‌లో అతి తక్కువ వ్యవధిలో ఎక్కువ అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెలుతోంది ఈ బ్యూటీ. రకుల్ దక్కించుకుంటున్న సినిమాలన్నీ దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలవే కావడం విశేషం. 
 
చిన్న సినిమాలతో అడుగుపెట్టి ..క్రమక్రమంగా పెద్ద పెద్ద హీరోల సరసన చాన్సులు కొట్టేసిన ఈ అమ్మడు... చూస్తుండగానే సక్సెస్ మెట్లు ఎక్కేసి, ఒక దానివెంట ఒకటి ఛాన్సులు అందుకుంటూ చేతినిండా సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. తాజాగా విక్రమ్‌తో 'సామి' సీక్వెల్‌లో కూడా నటించే ఆఫర్ రకుల్ చేతికే వచ్చిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే 'సామి 2' స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయినట్లు సమాచారం.
 
 ప్రస్తుతం మురుగదాస్ డైరెక్షన్‌లో మహేష్‌బాబుతో ఓ సినిమా చేస్తున్న ఈఅమ్మడు... గోపీచంద్ మలినేని - సాయిధరమ్ తేజ్ కాంబోకి ఈ బ్యూటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసిందనే టాక్ వినపడుతోంది. ఇందులో తాజా ప్రాజెక్టులో ఇంతవరకు చేయని కొత్త రోల్‌లో కనిపిస్తానని, ఈ మూవీ కోసం తనకు ఇష్టమైన ఫుడ్‌కి దూరమవుతున్నానంటూ మనసులోని మాటను బయటపెట్టింది. కెరీర్‌లో హిట్స్ కంటే కూడా ఫ్లాప్స్ శాతమే ఎక్కువ. అయినప్పటికీ అమ్మడికి ఆఫర్స్ మాత్రం వరుసగా వస్తున్నాయి. డిజాస్టర్స్ తర్వాత కూడా స్టార్ హీరోలు రకుల్‌నే హీరోయిన్‌గా ఫైనల్ చేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాలో నారా లోకేష్.. తెలంగాణ నెటిజన్ల బాధేంటంటే?

ఏపీలో రూ.1,40,000 కోట్లు పెట్టుబడి.. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్

సొంత రాష్ట్రం.. ఆర్మీ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి సెలెబ్రేషన్స్ (video)

కేరళలో వందే భారత్ సరికొత్త ట్రాక్‌ల కోసం ఏర్పాట్లు

ఆ మీడియా సంస్థలను నడిరోడ్డు మీద నిలబెడతా: పోలీసు వాహనం నుంచి బోరుగడ్డ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

ఎముక పుష్టి కోసం ఇవి తినాలి, ఇలా చేయాలి

తర్వాతి కథనం
Show comments