Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండస్ట్రీలో పవన్‌ను మించిన హీరో మరొకరు లేడు : భానుప్రియ

ముందుతరం సినీ హీరోయిన్ భానుప్రియ అనగానే ఆమె విశాల నేత్రాలు, రూపలావణ్యం, అభినయం, ఆమె నాట్యం.. ఒకటి వెంట ఒకటి వరుసగా గుర్తుకు వస్తాయి. గతంలో సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు నుంచి ఒకనాటి అగ్ర హీరోలందరితో

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2016 (09:42 IST)
ముందుతరం  సినీ హీరోయిన్ భానుప్రియ అనగానే ఆమె విశాల నేత్రాలు, రూపలావణ్యం, అభినయం, ఆమె నాట్యం.. ఒకటి వెంట ఒకటి వరుసగా గుర్తుకు వస్తాయి. గతంలో సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు నుంచి ఒకనాటి అగ్ర హీరోలందరితోనూ రొమాన్స్ పండించిన హీరోయిన్ భానుప్రియ. దాదాపు దశాబ్దం క్రితం హీరోయిన్ పాత్రలకు దూరమైన ఈ హీరోయిన్ ఆ తరువాత హీరో తల్లి పాత్రలతో టాలీవుడ్‌లో తన జోరుని కొనసాగిస్తోంది. 
 
రీసెంట్‌గా ఓ ఇంటర్యూలో మాట్లాడింది భానుప్రియ. నాకు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది. ఈ ఇద్దరి హీరోల లుక్స్, యాక్టింగ్ బాగుంటుందని కూడా చెప్పింది. అయితే ఆ తర్వాతే అందరికీ షాక్ ఇచ్చేలా అవకాశం ఇస్తే మహేష్, పవన్ పక్కన హీరోయిన్‌గా నటిస్తానని అని చెప్పింది భానుప్రియ. ఇప్పుడు ఆ మాటలే సోషల్ మీడియాలో ఎటకారంగా మారిపోయింది. మహేష్ పక్కన భానుప్రియకు హీరోయిన్ ఛాన్సా? క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మహేష్ సినిమాలో యాక్ట్ చేయాలని ఉంది అని ఉంటే బాగుండేదని మరీ హీరోయిన్‌గా యాక్ట్ చేయాలని ఉంది అని చెప్పడం మరీ విడ్డూరంగా ఉందని సెటైర్స్ పడుతున్నాయి.
 
 పవన్ అంటే తాను పడిచస్తానని, పవన్‌ని మించిన మరో హీరో లేడని పొగడ్తల వర్షాన్నికురిపిస్తోంది ఈ టాప్ హీరోయిన్. ఇండస్ట్రీలో పవన్‌ను మించిన హీరో మరొకరు లేడని, అత్తారింటికి దారేదీ సినిమాను ఎన్నోసార్లు చూశానని అంటోంది. ఈ వయసులో కూడా కుర్ర హీరోల పక్కన హీరోయిన్ చేయాలన్న ఈ భామ కోరిక చూసి సినీ జనాలు నోరెళ్లబెడుతున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాలో నారా లోకేష్.. తెలంగాణ నెటిజన్ల బాధేంటంటే?

ఏపీలో రూ.1,40,000 కోట్లు పెట్టుబడి.. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్

సొంత రాష్ట్రం.. ఆర్మీ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి సెలెబ్రేషన్స్ (video)

కేరళలో వందే భారత్ సరికొత్త ట్రాక్‌ల కోసం ఏర్పాట్లు

ఆ మీడియా సంస్థలను నడిరోడ్డు మీద నిలబెడతా: పోలీసు వాహనం నుంచి బోరుగడ్డ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

ఎముక పుష్టి కోసం ఇవి తినాలి, ఇలా చేయాలి

తర్వాతి కథనం
Show comments