Webdunia - Bharat's app for daily news and videos

Install App

'భీముడు'గా వస్తున్న నారావారబ్బాయ్!

టాలీవుడ్‌లో నారా ఇంటి కుర్రాడు నారా రోహిత్ యమ జోరుమీదున్నాడు. ముప్పైరోజుల వ్యవధిలోనే రెండు సినిమాలు విడుదల చేసి, మరో ఏడు సినిమాలతో సిద్ధంగా ఉన్నాడు. ''తుంటరి'', ''సావిత్రి'', ''జ్యో అచ్యుతానంద'' సినిమ

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2016 (08:55 IST)
టాలీవుడ్‌లో నారా ఇంటి కుర్రాడు నారా రోహిత్ యమ జోరుమీదున్నాడు. ముప్పైరోజుల వ్యవధిలోనే రెండు సినిమాలు విడుదల చేసి, మరో ఏడు సినిమాలతో సిద్ధంగా ఉన్నాడు. ''తుంటరి'', ''సావిత్రి'', ''జ్యో అచ్యుతానంద'' సినిమాలు మంచి టాక్‌ని తెచ్చుకోవడంతో మంచి ఊపుమీదున్నాడు. విభిన్న కథాంశాలతో వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్న యంగ్ హీరో , తన తాజా చిత్రానికి మరో వెరైటీ స్టోరీ లైన్‌ను ఎంచుకున్నాడు. ఈసారి హారర్ థ్రిల్లర్ చేయడానికి రెడీ అవుతున్నాడు.
 
 తనకు గతంలో ''సావిత్రి'' లాంటి మంచి సినిమాను అందించిన దర్శకుడు పవన్ సాదినేని..ఈసారి ఒక ఇంట్రెస్టింగ్ హారర్ థ్రిల్లర్ కథ చెప్పాడట. ఈ కథలో బాగా దమ్ముండటంతో.. వెంటనే ''భీముడు'' అనే టైటిల్ ఫిక్స్ చేసేసి.. ఈ సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నరు దర్శకనిర్మాతలు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి. కాగా, నారా రోహిత్ ప్రస్తుతం 'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రాన్ని చేస్తున్న సంగతి విదితమే.
 
ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు విశేషమైన ఆదరణ లభిస్తోంది. మొన్నటికి మొన్న ''జో అచ్యుతానంద'' అంటూ హిట్టు కొట్టాడు.. ఇప్పుడేమో... ''అప్పట్లో ఒకడుండేవాడు'' సినిమాతో కూడా కాస్త గాట్టిగా కొట్టేట్లే అనిపిస్తున్నాడు. ఇప్పుడేమో ''భీముడు''గా భయానకరసం చూపిస్తానంటున్నాడు. రోహిత్ వరుసగా సినిమాలు చేస్తున్నా...ఇప్పటివరకు సరైన హిట్ పడలేదు. ఈ నేపధ్యంలో అయన నటిస్తున్న తదుపరి సినిమా 'అప్పట్లో ఒకడుండేవాడు' అనే సినిమా తన కెరీర్‌కు కచ్చితంగా మంచి బ్రేక్ ఇస్తుందని నారా రోహిత్ ఆశిస్తున్నాడు.

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments