ఆవేశమైన నిర్ణయాలతో అది పోగొట్టుకున్నా.. రకుల్ ప్రీత్ సింగ్

Webdunia
సోమవారం, 13 మే 2019 (16:26 IST)
వరుస విజయాలతో తెలుగు సినీపరిశ్రమలో తనకంటూ ఒక పేరును సంపాదించుకుంది రకుల్ ప్రీత్ సింగ్. యువహీరోలే కాకుండా అగ్రహీరోల సరసన రకుల్ నటించింది. టాప్ హీరోయిన్లలో స్థానం సంపాదించుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య కొత్త కొత్త విషయాలను స్నేహితులతో షేర్ చేసుకుంటోందట. అయితే అవన్నీ వ్యక్తిగతమే అయినా తన స్నేహితులే కాబట్టి వారితో తన బాధను, సంతోషాన్ని రెండింటిని పంచుకుంటోందట రకుల్ ప్రీత్ సింగ్.
 
గత కొన్నిరోజుల నుంచి రకుల్ ప్రీత్ సింగ్ స్నేహితులతో తన బాధను చెప్పుకుంటోందట. ఎవరైనా దర్సకుడు తన వద్దకు వచ్చి కథ చెబితే వెంటనే నటించేస్తానని ఒప్పేసుకుంటుందట. ఇది తనకు చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతోందని చెబుతోంది రకుల్. సాధారణంగా అయితే ఎవరు కూడా హడావిడిగా నిర్ణయాలు తీసుకోరు. నా విషయంలో ఎందుకంటే అలాంటి నిర్ణయాలు తీసుకుని చాలా బాధపడుతున్నాను.
 
ఎన్నో సినిమాలు అలా ఫెయిలై నా కెరీర్‌ను డ్యామేజ్ కూడా చేశాయి. అయినా నేను ఇప్పటికీ మారలేకపోతున్నాను. దర్సకులందరిపైనా నాకు నమ్మకం. కథ అంటే అది మామూలే. కథ విన్నంత మాత్రాన సినిమా సక్సెస్ అవుతుందా... ఫెయిలవుతుందా నేను చెప్పలేను కదా. అందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నానని బాధపడుతూ చెబుతోందట రకుల్ ప్రీత్ సింగ్. ఇలాంటి నిర్ణయాలను మాత్రం ఇక నుంచి ఖచ్చితంగా ఆలోచించి తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చేసిందట రకుల్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ములుగు జిల్లా.. ఉద్యోగి భుజంపై ఎక్కి కూర్చుని హాయిగా నిద్రపోయిన వానరం (video)

గర్భవతిని చేసి బిడ్డ పుట్టాక రెండో పెళ్లి -ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా

Minor girl: తమ్ముడు కిందపడిపోయాడని నమ్మించి.. బాలికపై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

నాలుగో తరగతి చదివే బాలిక 4వ అంతస్థు నుంచి దూకేసింది.. ఎందుకిలా? (video)

Thalapathy Vijay: మంత్రి నారా లోకేష్‌ను చూసి టీవీకే చీఫ్ విజయ్ నేర్చుకోవాలి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

తర్వాతి కథనం
Show comments