Webdunia - Bharat's app for daily news and videos

Install App

జక్కన్న నెక్ట్స్ మూవీ మహేష్ బాబుతోనా? ప్రభాస్‌తోనా?

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (15:32 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా తర్వాత రాజమౌళి ఎవరితో అనేది ఆసక్తిగా మారింది. అటు అభిమానుల్లోను ఇటు ఇండస్ట్రీలోను జక్కన్న నెక్ట్స్ ఎవరితో సినిమా చేయనున్నాడు అనే చర్చ జరుగుతుంది. అయితే... ఎప్పటి నుంచో మహేష్ బాబు - రాజమౌళి  కాంబినేషన్లో మూవీ గురించి వార్తలు వచ్చాయి కానీ.. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. 
 
మహేష్‌ బాబుతో సినిమా చేస్తే ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుందని రాజమౌళి గతంలో నెటిజన్లను అడగడం జరిగింది. చాలా మంది అల్లూరి సీతారామరాజు సినిమాని మహేష్‌ బాబుతో చేయమన్నారు. అయితే.. మహేష్ బాబు కానీ.. రాజమౌళి కానీ అల్లూరి సీతారామరాజు సినిమాని మహేష్‌‌తో చేయడానికి ఇంట్రస్ట్ చూపించడం లేదు. కారణం ఏంటంటే... మహేష్ అల్లూరి సీతారామరాజు సినిమా చేస్తే... తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో పోలుస్తారు. 
 
కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా అనేది క్లాసిక్. ఆ క్లాసిక్ ని టచ్ చేయకూడదు అనేది మహేష్ ఆలోచన. దీనికి రాజమౌళి కూడా ఓకే చెప్పడంతో వీరిద్దరూ కలిసి అల్లూరి సీతారామరాజు కాకుండా మరో సినిమా చేయాలనుకున్నారు. మహేష్‌ బాబుతో.. మోసగాళ్లకు మోసగాళ్లు తరహా యాక్షన్ మూవీ చేస్తానని రాజమౌళి గతంలో చెప్పారు.
అయితే.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా ప్లాన్ చేస్తున్నారని.. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ మూవీగా రూపొందనుందని తెలిసింది. దీని కోసం స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ ఆల్రెడీ స్టోరీ రెడీ చేయడం జరిగింది అంటూ వార్తలు వస్తున్నాయి. మరోవైపు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో మళ్లీ సినిమా చేసేందుకు రెడీ అని రాజమౌళి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియచేసారు. 
 
ఎప్పుడు స్టోరీ సెట్ అయితే.. అప్పుడు ప్రభాస్‌తో సినిమా ఉంటుందని జక్కన్న తెలియచేసాడు. దీంతో ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి మహేష్‌ బాబుతో సినిమా చేస్తాడా..? లేక ప్రభాస్‌తో చేస్తాడా..? అనేది ఆసక్తిగా మారింది. మరి.. జక్కన్న నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలితో సహజీవనం, పెళ్లి మాటెత్తేసరికి చంపి ఫ్రిడ్జిలో పెట్టేసాడు

Roja: వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు? ఆర్కే రోజా ప్రశ్న

Cockfight: కోడిపందేలు బంద్.. రంగంలోకి పోలీసులు.. కారణం ఏంటంటే?

నీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటానంటూ భర్తకు సవాల్, మనస్తాపంతో భర్త ఆత్మహత్య

హష్ మనీ కేసు.. డొనాల్డ్ ట్రంప్ దోషే.. కానీ శిక్ష లేదు.. నేర చరిత్రతో పదవిలోకి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments