Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అప్పుడే ఆర్ఆర్ఆర్ రన్ టైమ్ బయటకు వచ్చేసింది..!

Advertiesment
అప్పుడే ఆర్ఆర్ఆర్ రన్ టైమ్ బయటకు వచ్చేసింది..!
, బుధవారం, 15 ఏప్రియల్ 2020 (22:13 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం... నందమూరి హీరో ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్‌ కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాని ఎనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ కోసం అభిమానులే కాకుండా సామన్య ప్రేక్షకుల సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 
 
కరోనా వలన షూటింగ్ ఆగినప్పటికీ.. ఈ సినిమాకి సంబంధించి రోజుకో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వస్తుంది. ఇటీవల రామ్ చరణ్ కి సంబంధించిన వీడియో రిలీజ్ చేయడం.. ఆ వీడియో  అలా రిలీజ్ చేసారో లేదో  ఇలా యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మళయాల భాషల్లోనూ ఇదే వీడియో రిలీజ్ అయింది. ఈ టీజర్ చూసినవారికి గూస్ బంప్స్ వచ్చాయంటే ఎలా అర్ధం చేసుకోవచ్చు. 
 
ఇదిలా ఉంటే..తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే... బాహుబలి చిత్రం రెండున్నర గంటలకి పైనే వుంది. బాహుబలి 2 విషయానికి వస్తే... 10 నిమిషాల తక్కువ 3 గంటల నిడివిని కలిగి వుంది. దీంతో ఆర్ఆర్ఆర్ మూవీ ఎంత నిడివిని కలిగి ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా 3 గంటల నిడివిని కలిగి ఉండేలా చూస్తున్నారని తెలిసింది.
 
కథాకథనాలు .. బలమైన సన్నివేశాలు .. ప్రధాన పాత్రల ప్రాధాన్యత .. సందర్భానికి తగిన పాటల కారణంగా 3 గంటల నిడివిని కలిగి ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమాను తెలుగుతో పాటు వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు. అందువలన ఆయా భాషల నటుల పాత్రలకు కూడా ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. ఇక భారీతనం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ కావడం వలన, నిడివి పెరుగుతుందని అంటున్నారు. 
 
మంత్రముగ్ధులను చేయడంలో రాజమౌళి సిద్ధహస్తుడు. అందువలన ప్రేక్షకులు నిడివి గురించి ఆలోచించడం జరగదు. సినిమా షూటింగ్ కంప్లీట్ కాకుండానే ఆర్ఆర్ఆర్ నిడివి అంటూ వార్తలు వస్తుండడం నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరి.. ఇందులో వాస్తవం ఉందో లేదో జక్కన్నకే తెలియాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ ఇకపై సినిమాలు చేయాలనుకోవడం లేదా?