Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బు కోసం అలాంటి సినిమాల్లో నటించాల్సి వచ్చింది: రాధికా ఆప్టే

బోల్డ్‌గా మాట్లాడటంలో ఎప్పుడూ ముందుండే సినీ తార రాధికా ఆప్టే.. సినీ రంగ ప్రవేశం కోసం తాను పడిన పాట్లను చెప్పుకొచ్చింది. సినిమా రంగంలో బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారికే అవకాశాలు సులభంగా లభిస్తాయని, అది లేకపోత

Webdunia
బుధవారం, 20 జూన్ 2018 (09:58 IST)
బోల్డ్‌గా మాట్లాడటంలో ఎప్పుడూ ముందుండే సినీ తార రాధికా ఆప్టే.. సినీ రంగ ప్రవేశం కోసం తాను పడిన పాట్లను చెప్పుకొచ్చింది. సినిమా రంగంలో బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారికే అవకాశాలు సులభంగా లభిస్తాయని, అది లేకపోతే, కష్టాలు తప్పవని పేర్కొంది. తనకు ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోవడంతో మొదట్లో ఇబ్బందులు తప్పలేదని చెప్పుకొచ్చింది. 
 
ఎలాంటి సినిమాల్లో నటించకూడదని భావించానో.. డబ్బుకోసం అలాంటి చిత్రాల్లోనే నటించాల్సి వచ్చిందని రాధికా ఆప్టే తెలిపింది. జీవనాధారం కోసం అలాంటి సినిమాల్లో నటించక తప్పలేదని వెల్లడించింది. ప్రస్తుతానికైతే తనకు పేరుతో డబ్బుకూడా వుందని.. సినీ అవకాశాలు కూడా చాలానే వస్తున్నాయని రాధికా ఆప్టే చెప్పింది. 
 
కానీ అన్నీ సినిమాల్లో నటించేందుకు అంగీకరించట్లేదని.. కథ నచ్చితేనే ఒప్పుకుంటున్నానని తెలిపింది. డబ్బు కోసం కొన్ని అసభ్యకర చిత్రాల్లో నటించడంతోనే ప్రస్తుతం తనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని తెలిపింది. ప్రస్తుతం రాధిక బజార్, షూట్ ది పియానో ప్లేయర్ సినిమాల్లో నటిస్తోంది. ఇటీవల ఆన్‌లైన్లో విడుదలైన బోల్డ్ మూవీ లస్ట్ స్టోరీస్‌కు మంచి ప్రశంసలు అందుకుంటోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వన్ నేషన్-వన్ ఎలక్షన్: దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా

కేటీఆర్‌ను కలవలేదు.. కనీసం ఫేస్ టు ఫేస్ చూడలేదు.. దువ్వాడ మాధురి (video)

Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదు : సీవీ ఆనంద్

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments