Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారతీయ సినిమాలు మహిళల నడుము, శరీర సౌందర్యం చుట్టూ తిరుగుతాయి.. (video)

అమెరికా టెలివిజన్ సిరీస్ "క్వాంటికో'' సీరియల్‌లో ప్రియాంకా చోప్రా నటించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భారతీయులను టెర్రరిస్టులుగా చూపించగా, దానిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ప్రియాంక చోప్రా ట్

Advertiesment
భారతీయ సినిమాలు మహిళల నడుము, శరీర సౌందర్యం చుట్టూ తిరుగుతాయి.. (video)
, సోమవారం, 11 జూన్ 2018 (15:45 IST)
అమెరికా టెలివిజన్ సిరీస్ "క్వాంటికో'' సీరియల్‌లో ప్రియాంకా చోప్రా నటించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భారతీయులను టెర్రరిస్టులుగా చూపించగా, దానిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ప్రియాంక చోప్రా ట్విట్టర్లో స్పందించారు. భారత ప్రజల మనోభావాలను గాయపరచాలన్న ఉద్దేశం తనకు ఏమాత్రం లేదన్నారు. భారతీయురాలిగా తాను గర్విస్తున్నానని చెప్పారు.
 
క్వాంటికో తాజా ఎపిసోడ్ భారతీయుల మనోభావాలను దెబ్బతీసి ఉంటే అందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని.. మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేస్తున్నానని.. ఓ భారతీయురాలిగా తాను గర్వపడుతున్నానని.. అది ఎప్పటికీ మారనని ట్వీట్ చేసింది. 
 
కాగా క్వాంటికో ఎపిసోడ్ జూన్ 1న ప్రసారమైంది. వివాదాస్పద కథనంలో నటించేందుకు భారతీయురాలైన ప్రియాంక చోప్రా ఎలా అంగీకరించిందని నెటిజన్లు మండిపడ్డారు. దీంతో ప్రియాంక చోప్రా క్షమాపణలు చెప్పింది. అయితే భారతీయులకు క్షమాపణలు చెప్పిన గంటల్లోనే.. ప్రియాంకా చోప్రా  68వ ఎమ్మీ అవార్డుల కార్యక్రమంలో భారతీయ సినిమాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. 
 
భారతీయ సినిమాలు మహిళల నడుము, శరీర సౌందర్యం చుట్టూ తిరుగుతాయని ప్రియాంక చోప్రా వ్యాఖ్యానించింది. ప్రియాంకా చోప్రా వ్యాఖ్యలపై మళ్లీ నెటిజన్లు మండిపడుతున్నారు. బాలీవుడ్‌లో పేరు తెచ్చుకుని.. హాలీవుడ్‌కు వెళ్లినంత మాత్రాన.. భారతీయ సినిమాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రియాంకకు ఏమాత్రం తగదని నెటిజన్లు మండిపడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షారూఖ్ ఖాన్ కుమార్తె ఫోజులు చూస్తే..?