Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరుకి పూరీ క‌థ చెప్పాడా..? ఇది నిజ‌మేనా..?

Webdunia
మంగళవారం, 23 జులై 2019 (22:03 IST)
డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తాజా చిత్రం ఇస్మార్ట్ శంక‌ర్. ఈ సినిమా చేస్తున్న‌ సంచ‌ల‌నం చూసి సినీ పండితులు సైతం షాక్ అవుతున్నారు. ఎందుకంటే... ఈ సినిమా హిట్ అవుతుంది అనుకున్నారు కానీ.. మ‌రీ.. ఈ రేంజ్‌లో అవుతుంద‌ని అనుకోలేదు. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఆ త‌ర్వాత రోజురోజుకు క‌లెక్ష‌న్స్ పెరుగుతూ బ్లాక్‌బ‌ష్ట‌ర్ అయ్యింది. రామ్ కెరీర్లో హ‌య్య‌స్ట్ క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసిన సినిమాగా నిలిచింది. 
 
ఇదిలా ఉంటే... ఇస్మార్ట్ బ్లాక్ బ‌ష్ట‌ర్ అనే టాక్ రావ‌డంతో పూరికి వ‌రుస‌గా ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. యువ హీరోలు, సీనియ‌ర్ హీరోలు పూరితో సినిమాలు చేసేందుకు ఇంట్ర‌ెస్ట్ చూపిస్తున్నారు. అయితే... పూరి ఓ ఛాన‌ల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో.. మెగాస్టార్ చిరంజీవికి పెద్ద ఫ్యాన్‌ని. ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న‌తో నాలుగుసార్లు సినిమా చేయాల‌నుకున్నాను కానీ.. కుద‌ర‌లేదు. 
 
రెండుసార్లు అయితే పూజా కార్య‌క్ర‌మాలు కూడా జ‌రిగాయి అని చెప్పారు. ఈ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత ఇటీవ‌ల చిరుకి పూరి క‌థ చెప్పాడు అనే వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో అస‌లు ఇది నిజ‌మేనా..? అనే అనుమానం.

మ్యాట‌ర్ ఏంటంటే... పూరి ఇస్మార్ట్ ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్నారు. చిరు కొర‌టాల సినిమాల కోసం వైజాగ్‌లో క‌స‌ర‌త్త‌లు చేస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో పూరి, చిరుకి క‌థ చెప్ప‌డం అనేదే జ‌ర‌గ‌లేదు అని స‌మాచారం. అవ‌కాశం ఇస్తే.. 5 రోజుల్లో క‌థ రెడీ చేస్తానంటున్నాడు పూరి. మ‌రి.. చిరు పూరికి అవ‌కాశం ఇస్తాడా..? లేదా..? చూద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana : పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ వల్ల తెలంగాణ ఇబ్బందా?

ఆ నీళ్ళు రాజస్థాన్‌కు మళ్లిస్తాం.. పాక్ గొంతు ఎండాల్సిందే : అమిత్ షా

క్వారీ యజమానికి బెదిరింపులు - ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు

భారత్ - పాక్ యుద్ధాన్ని ఆపాను... నోబెల్ శాంతి బహుమతి రాదేమో? : డోనాల్డ్ ట్రంప్

స్త్రీ ఒక పువ్వు - ప్రశంస లేకుండా ఒక పువ్వుతో వ్యవహరిస్తే... : అలీ ఖమేనీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments