Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీ బాలీవుడ్ మూవీ, హీరో ఎవరో తెలుసా?

Webdunia
సోమవారం, 25 మే 2020 (19:26 IST)
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్... సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పూరి - ఛార్మి- కరణ్‌ జోహర్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది. ఇదిలావుంటే.. లాక్ డౌన్ టైమ్‌లో పూరి ఓ స్ర్కిప్ట్ రెడీ చేసాడు.
 
స్వయంగా పూరి జగన్నాథే స్ర్కిప్ట్ రాసానని చెప్పడంతో ఆ కథ ఎవరి కోసం అయ్యుంటుంది అనేది ఆసక్తిగా మారింది. నందమూరి నటసింహం బాలయ్య కోసం అయ్యుంటుందని కొంతమంది అంటుంటే.. కాదు మెగాస్టార్ చిరంజీవి కోసం కథ రెడీ చేసారని మరి కొంతమంది అనుకున్నారు.
 
తాజా వార్త ఏంటంటే... పూరి రాసింది మెగాస్టార్ చిరంజీవి కోసం కాదు.. నందమూరి నట సింహం బాలకృష్ణ కోసం కాదట. ఇంకా చెప్పాలంటే... పూరి రాసిన కథ తెలుగు హీరోల కోసం కాదట. హిందీ హీరోల కోసమని సమాచారం. అవును.. పూరి బాలీవుడ్ మూవీ ప్లాన్ చేస్తున్నాడని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఎవరితో అంటారా..?
 
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కోసం అని వార్తలు వస్తున్నాయి. గతంలో పూరి అమితాబ్‌తో బుడ్డా హోగా తేరా బాప్ అనే చిత్రం తెరకెక్కించారు. ఆ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ సాధించింది.
 
 దీంతో ఇప్పుడు మళ్లీ పూరి బాలీవుడ్ మూవీ చేయనున్నాడు అని టాక్ రావడంతో అటు బాలీవుడ్‌లోను ఇటు టాలీవుడ్‌లోను హాట్ టాపిక్‌గా మారింది. త్వరలో అఫిషిలయ్‌గా ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments