ఓర చూపుతోనే కాదు. పరువాలు పచ్చబొట్టుతోనూ విందు చేస్తున్న ప్రియా వారియర్ అలస్తానంటోంది. `ఒరు ఆదార్ లవ్` అనే మలయాళ సినిమాలో ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా అభిమానుల్నీ సంపాదించుకున్న ప్రియా వారియర్ కు ఆ సినిమా తర్వాత తెలుగులో చేసినా గుర్తింపురాలేదు. నితిన్ చెక్ సినిమాలు నటించినా చిన్న పాత్రయినా బేనర్, దర్శకుడు వాల్యూ చూసి చేసినట్లు తెలియజేసింది. తాజాగా తేజ సజ్జా హీరోతో `ఇష్క్` సినిమా చేసింది. ఆ సినిమా కథాపరంగా ఆకట్టుకోలేకపోయింది. ఆ చిత్ర ప్రమోషన్‌లోనే గ్లామర్ పాత్రలకు సిద్ధమని ప్రకటించింది. కానీ సినిమాలపరంగా అటువంటి పాత్రలు రావడంలేదని గ్రహించింది. ఇప్పుడు ఓ వ్యాపారప్రకటనలో పాల్గొంది
Priya Warrior
ప్రియా పాలుగారే అందాలతో అలరిస్తోంది. నల్లటి సిల్క్ గౌన్‌తో గ్లామర్ లుక్ ఇస్తూ కనిపించింది. గృహలక్ష్మీ మేగజైన్‌కు పారిస్ దుస్తులు ధరించింది. మిరాల్డ్ ఆభరణాలు ధరించి మెరిసిపోతుంది. అయితే తన అదరాలపై యువర్స్ అనేలా పచ్చబొట్టు కనిపిస్తోంది. తనకూ ఓ బాయ్ ఫ్రెండ్ వున్నాడనీ గతంలో ప్రకటించిన ప్రియా అతని పేరుమీద పచ్చబొట్టు పొడిపించుకుందని నెట్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.