Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ 'చందమామ' గర్భవతినా?

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (22:10 IST)
టాలీవుడ్ చందమామగా గుర్తింపు పొందిన కాజల్ అగర్వాల్ గర్భందాల్చినట్టు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాజల్ తల్లికాబోతుందనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. దీనికితోడు ఆమె ఈ మధ్యకాలంలో కొత్త చిత్రాలను అంగీకరించడాన్ని తగ్గించారు. గర్భందాల్చడం వల్లే ఆమె సినిమాలు తగ్గించారనే ప్రచారం సాగుతోంది. 
 
'లక్ష్మీకళ్యాణం' మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్‌కు 'చందమామ', 'మగధీర' వంటి చిత్రాల ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వెనకకు చూసుకోవాల్సిన పని లేకుండా అన్ని ఇండస్ట్రీలలో సినిమాలు చేస్తూ వస్తుంది. 
 
యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోల పక్కన జోడి కట్టిన ఈ భామ.. గత ఏడాది ముంబైకు చెందిన యువపారిశ్రామికవేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ వచ్చింది.
 
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ చిత్రాన్ని పూర్తి చేసిన కాజల్, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ది ఘోస్ట్’ అనే చిత్రంలో కింగ్ నాగార్జున సరసన నటించేందుకు సమ్మతించింది. ఈ చిత్ర షూటింగ్ కూడా ఈ మధ్యే మొదలైంది. ఇందులో ఆమె రా ఏజెంట్‌గా నటిస్తున్నారు. 
 
అయితే ఇప్పుడు ఈ మూవీ నుంచి ఈమె తప్పుకున్నట్లు తెలుస్తుంది. దీనికి కారణం ఆమె తల్లి కాబోతుండడమే అని అంటున్నారు. ఆమె స్థానంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లేదా ఇలియానా లేదా త్రిషని తీసుకునే అవకాశాలు ఉన్నట్లుగా రూమర్స్ వినపడుతున్నాయి. మరి నిజంగా కాజల్ తల్లి కాబోతుందా లేదా అనేది త్వరలోనే అధికారికంగా తెలియనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నతల్లిపై కేసు వేసిన కొడుకుగా - ఆస్తులు కాజేసిన మేనమామగా జగన్ మిగిలిపోతారు... షర్మిల

తెలంగాణలో అకాల వర్షాలు.. భారీగా పంట నష్టం.. ఐదుగురు మృతి

సీఎం స్టాలిన్‌కు షాక్ : నీట్ బిల్లును తిరస్కరించిన రాష్ట్రపతి

కేరళ సీఎంకు షాకిచ్చిన కేంద్రం.. కుమార్తె వీణ వద్ద విచారణకు ఓకే!

'నువ్వు చాలా అందంగా ఉంటావు.. నిన్ను ఎవరైనా ప్రేమిస్తే నేనేం చేయాలి' : యువతి సూసైడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments